Ram Charan Lungi Dance.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం టాలీవుడ్‌కి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.!
సల్మాన్ ఖాన్ (Salman Khan) ఊరుకుంటాడా.? తన తాజా చిత్రం ‘Kisi Ka Bhai Kisi Ki Jaan’ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని తీసుకెళ్ళాడు.!
‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం ఆన్ స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సల్మాన్ ఖాన్ (Salman Khan) డాన్స్ చేస్తే.. ఏ రేంజ్‌లో వుందో చూశాం కదా.!
ఇప్పుడిక థియేటర్లలో సల్మాన్ ఖాన్ (Salman Khan) – రామ్ చరణ్ (Global Star Ram Charan) కలిసి డాన్స్ చేస్తే ఎలా వుండబోతోందో చూడనున్నాం.!
Ram Charan Lungi Dance.. విక్టరీ వెంకటేష్ కూడా..
‘బుట్టబొమ్మ’ పూజా హెగ్దే (Pooja Hegde) ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) కోసం విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కూడా సల్మాన్ ఖాన్‌తో చేతులు కలిపాడు.
తాజాగా ‘ఏంటమ్మా’ (Yentamma Song) అంటూ ఓ సాంగ్ విడుదల చేశారు ఈ ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) నుంచి.
మొన్నటికి మొన్న ఇదే సినిమా నుంచి ‘బతుకమ్మ’ (Bathukamma Song From Kisi Ka Bhai Kisi Ki Jaan) సాంగ్ విడుదల చేస్తే, అదో సంచలనమైంది.
హిందీ సినిమాలో తెలుగు సాంగ్.. అందునా, తెలంగాణ (Telangana) బ్రాండ్ ‘బతుకమ్మ’ సాంగ్.. ఇది నిజంగానే వెరీ వెరీ స్పెషల్.
‘ఏంటమ్మా’ సాంగ్ వేరే లెవల్‌లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్.. వీరితోపాటు పూజా హెగ్దే (Pooja Hegde) కూడా లుంగీ డాన్స్ (Lungi Dance) అదరగొట్టేసింది మరి.!
Also Read: నిజాయితీగా వున్నా విడాకులొచ్చాయ్: సమంత వైరల్ కామెంట్స్
కొన్నాళ్ళ క్రితం ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ (Chennai Express Movie) కోసం దీపికా పడుకొనే (Deepika Padukone), షారుక్ ఖాన్ (Shah Rukh Khan) లుంగీ డాన్స్ అదరగొట్టేసిన సంగతి గుర్తుండే వుంటుంది.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) – దీపిక పడుకొనే (Deepika Padukone) ‘లుంగీ డాన్స్’ని.. ఈ ‘ఏంటమ్మా’ లుంగీ డాన్స్ సాంగ్ బీట్ చేస్తుందా.? వేచి చూడాల్సిందే.