Ravanasura First Review.. హ్యాట్రిక్ హిట్ కొడతాడంటూ అభిమానులు ఆల్రెడీ ఫిక్సయిపోయారు. ఇంతకీ, మాస్ మహరాజ్ రవితేజ ‘రావణాసుర’తో ఏం చేశాడు.?
‘ఇలా చేస్తాడనుకోలేదు..’ అంటూ నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి ప్రీమియర్స్ నుంచి. ‘డిజాస్టర్ అనలేంగానీ, బిలో యావరేజ్..’ అంటుున్నారు చాలామంది.
ఎటు చూసినా, 2.25 రేటింగ్స్‌కి తగ్గట్టే టాక్ వస్తోంది సినిమా చూసినవాళ్ళ నుంచి. అబ్బే, ఈ ప్రీ-టాక్ని అస్సలు నమ్మొద్దు.. అంటున్నారు రవితేజ అభిమానులు.
Ravanasura First Review.. ఎంటర్టైన్మెంట్ అదుర్స్..
సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వరకూ చాలా బావుందట. కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ విషయంలో దర్శకుడు తీసేసుకున్న సినిమాటిక్ లిబర్టీ కొంప ముంచిందట.
ఇక, రవితేజ వరకు పూర్తిస్థాయి ఎనర్జీ ఎప్పటిలానే పెట్టాడట. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారట కూడా.
వీక్ ప్లాట్‌ని సైతం రవితేజ, తనదైన ఎనర్జీతో నిలబెట్టాడన్నదే అంతటా వినిపిస్తోన్న టాక్. అయినాగానీ, ‘రెండున్నర రేటింగ్’ ఇవ్వడానికి పెద్దగా ఎవరూ సాహసించడంలేదు.
యావరేజ్ టాక్ సరిపోదా.?
‘క్రాక్’ సినిమాకి కూడా నెగెటివ్ టాక్ గట్టిగానే వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్. ‘ధమాకా’ విషయంలోనూ అదే జరిగింది.
ఆ లెక్కన, ‘రావణాసుర’కి మొదటి రోజు మొదటి షో.. యావరేజ్ టాక్ సరిపోతుంది.. ఆ తర్వాత మాస్ మహరాజ్ అభిమానులు చూసుకుంటారేమో.!
ఒక్కసారి మాస్ ఆడియన్స్‌లోకి సినిమా వెళ్ళిపోతే.. వసూళ్ళ జాతరే ఇక.!
ఫుల్ రివ్యూ కాస్సేపట్లో.. ఇక్కడే ఇదే స్పేస్ ఫాలో అవ్వండి.!