Pooja Hegde Red Rose.. వెండితెరపై అందంగా వెలిగిపోవడమే కాదండోయ్.. తాను నటించిన సినిమాని అంతే అందంగా స్టైలిష్‌గా ప్రమోట్ చేసుకోవడంలోనూ సిద్ధ హస్తురాలు బుట్టబొమ్మ పూజా హెగ్దే.
తొలి సినిమా ‘ముకుంద’ కోసం తెలుగులో ‘గోపికమ్మా.. ’ అంటూ క్యూట్‌గా పాట పాడేసి ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది.
అలా స్టార్ట్ అయిన పూజా హెగ్దే సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.
వాస్తవానికి ‘ఒక లైలా కోసం’ సినిమా పూజా హెగ్దేకి ఫస్ట్ మూవీ. అయితే, ‘ముకుంద’ ముందుగా రిలీజైంది. దాంతో, గోపికమ్మగా తెలుగు ప్రేక్షకులకు తన అందంతో వలలు విసిరేసింది పూజా హెగ్దే.
Pooja Hegde Red Rose.. జిల్ జిల్ జిగేల్ రాణి..
ఆ తర్వాత బాలీవుడ్‌లో చేసిన ‘మొహంజోదారా’ సినిమా ఫెయిల్ కావడంతో, కొన్నాళ్లు టాలీవుడ్‌కే పరిమితమైపోయింది. టాలీవుడ్ జనం పూజా హెగ్దేకి పట్టం కట్టేశారు.
స్టార్ స్టేటస్ కట్టబెట్టి ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్ హోదా దక్కించుకుంది పూజా హెగ్దే. తెలుగులో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ స్పెషల్ సాంగ్స్‌తోనూ మురిపించిందీ గోపికమ్మ.

‘అల వైకుంఠపురములో’ సినిమాతో బుట్టబొమ్మ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా ‘అరవింద సమేత..’ తదితర సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టి త్రివిక్రముడికి గోల్డెన్ ఛామ్ అయిపోయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ‘జిగేల్ రాణి’ అవతారమెత్తి రంగస్థలం’తో మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది. అలాగే, ‘ఎఫ్ 3’లో వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన స్పెషల్ స్టెప్పులిరగదీసింది.
ఇలా ఓ వైపు స్టార్ హీరోయిన్‌గా మరోవైపు కాస్ట్‌లీ స్పెషల్ సాంగ్స్‌తోనూ కేక పుట్టించిన పూజా హెగ్దే (Pooja Hegde)కి ప్రస్తుతం ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయ్.
కింద పడినా పై చేయి నాదే అనేలా..
ఫెయిలైనా పై చేయి నాదే అంటోన్న పూజా హెగ్దే ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది.
హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తనదైన బ్యూటిఫుల్ ప్రమోషన్లతో ఆకట్టుకుంటోంది పూజా హెగ్దే.
రెడ్ కలర్ పొట్టి గౌనులో పూజా హెగ్దే తాజా పోజులు కుర్రాళ్లను కిర్రాకెత్తిసున్నాయ్.
Also Read: బ్లాక్ హాట్ అన్వేషి.! అసలు సిసలు ‘ఐడెంటిటీ’ ఏంటో తెలుసా.?
పూజా హెగ్దే ఏం చేసినా ట్రెండింగే. అలాంటిది ఇంత హాట్ లుక్స్‌లో కనిపిస్తే ఏ స్థాయి ట్రెండింగ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా.?
అక్కడక్కడా గులాబీలు డిజైన్ చేసిన ఈ రెడ్ బ్రైట్ కలర్ పొట్టి గౌనులో పూజా హెగ్దే అందాలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.