Payal Rajput Mangalavaaram.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్.
ఈ బ్యూటీ తాజాగా ‘మంగళవారం’ (Mangalavaaram) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. పాయల్ రాజ్‌పుత్‌కి రాత్రికి రాత్రి స్టార్డమ్ రావడానికి కారణమైన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికీ అజయ్ భూపతే దర్శక్వం వహించిన సంగతి తెలిసిందే.
తెలుగుతోపాటు తమిళంలోనూ అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాలో విడుదల కాబోతోంది. ఈ ‘మంగళవారం’ సినిమాని ‘డ్రీమ్ మూవీ’ అంటోంది పాయల్ రాజ్‌పుత్.
Payal Rajput Mangalavaaram కొత్తగా ఏముందని.?
‘మంగళవారం’ సినిమా నుంచి పాయల్ రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘బ్యాక్ లెస్’ పోజులో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కనిపిస్తోంది. రెట్రో ఫీల్ కూడా వుంది.

అన్నట్టు, ఇందులో సీతా కోక చిలుక కూడా కనిపిస్తోందండోయ్.! దానికీ, ’మంగళవారం’ (Mangalavaaram) సినిమాకీ సంబంధమేంటి.?
Also Read: Akhil Agent Trailer Review: ఏంటి అఖిల్ ఇలా చేశావ్.?
రెట్రో లుక్.. ఆపై మోడ్రన్ లుక్.. రెండూ ఈ సినిమాలో వుండబోతున్నాయేమో.! అయినాగానీ, పాయల్ రాజ్‌పుత్‌కి సంబంధించి కొత్తదనం ఏమీ కనిపించడంలేదిక్కడ.