Custody Review.. పోలీస్ నేపథ్యంతో సినిమాలంటే ఒకప్పుడు సూపర్ హిట్టు.! కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు.. కథానాయకులు ఆయా పాత్రల్లో కనిపించి మెప్పించిన సినిమాలు చాలానే.!
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’ కూడా పోలీస్ నేపథ్యంలో తెరకెక్కిందే.! అరవింద్ స్వామి లాంటి సీనియర్ నటుడు.. కృతి శెట్టి రూపంలో గ్లామరస్ హీరోయిన్.. ‘కస్టడీ’ సినిమాకి కాస్టింగ్ పరంగా చాలా ప్లస్సులే వున్నాయ్.
ఇంతకీ, ఇది తెలుగు సినిమానా.? తమిళ సినిమాకి తెలుగు డబ్బింగా.? చాలామందికి ఈ డౌట్ రావడం సహజమే. వెంకట్ ప్రభు దర్శకుడు ఈ సినిమాకి. ద్విభాషా చిత్రమన్నారుగానీ.. తెలుగు నేటివిటీ అస్సలు కనిపించలేదు.
గతంలో నాగార్జున చేసిన ‘రక్షకుడు’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాకి తమిళ ఘాటు ఎక్కువ. తమిళ సినిమానే అది.! నాగచైతన్య కూడా అదే తప్పు చేసినట్టున్నాడు.!
Custody Review.. తెలుగు సినిమాయేనా.?
సినిమా మొదలైనప్పటినుంచీ, ఎక్కడా ఇది తెలుగు సినిమా.. అనిపించదు. నేటివిటీ విషయంలో సినిమా ‘బౌండరీలు’ దాటేసినా, ‘కస్టడీ’ విషయంలో ‘బౌండరీల్లో’ ఇరుక్కుపోయారు.

పాటల విషయంలో ‘తమిళ రొట్ట’ సుస్పష్టంగా కనిపించింది. సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య (Nagachaitanya) మెప్పిస్తాడు. కృతి (Krithi Shetty) శెట్టి కూడా బాగానే వుంది.
కాకపోతే, సినిమా కథ గందరగోళం. కథనం బోర్ కొట్టిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బావున్నాయ్.! సినిమాటోగ్రఫీ బావున్నా.. సాగతీత పుణ్యమా అని అది కూడా డల్ అయిపోయిందనిపిస్తుంది.
ఎడిటింగ్ చాలా వీక్.! అదేంటో, రిపీట్ సీన్స్ ఎక్కువైపోయాయ్.! అంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరించారో ఏమో.! అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. ఇలా కాస్టింగ్ స్ట్రాంగ్‌గానే వుంది.
కథ, కథనాలపై స్పష్టత ఏదీ.?
నిజానికి, నాగచైతన్య ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, కథ అలాగే కథనాల విషయంలో ముందే స్పష్టత తీసుకుని వుండాల్సింది.
వెంకట్ ప్రభు (Venkat Prabhu) సినిమాల్లో ఓ కన్విన్సింగ్ థింగ్.. దానికి తోడు మంచి మూడ్ కనిపిస్తాయి. అవేవీ ఈ సినిమాలో కనిపించలేదు.
ఓవరాల్‌గా ‘కస్టడీ’ (Custody Movie) సగటు ప్రేక్షకుడికి చాలా చాలా కష్టంగా మారిపోతుందనడం నిస్సందేహం.!
Also Read: అనసూయోక్తి.! కంపు నోరు.! పెంపకం తీరు.!
డబ్బింగ్ సినిమాల్ని అయినా అందులో కంటెంట్‌ని బట్టి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, ఇందులోని అరవ నేటివిటీ అస్సలు తెలుగు జనాలకు ఎక్కేలా లేకుండా పోయింది.
నో డౌట్.. నాగచైతన్యది (Akkineni Naga Chaitanya) రాంగ్ ఛాయిస్.! కొన్ని సార్లు అంతే.. వర్కవుట్ అవవు. ఇది కూడా వర్కవుట్ అవడం కష్టమే.!
చివరగా.. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి చాలా చాలా నమ్మకంగా చెప్పాడు నాగచైతన్య (Nagachaitanya) సినిమా ప్రమోషన్ల సమయంలో.! కానీ, అది కొన్ని చోట్ల ఓకే.. చాలా చోట్ల అస్సలు బాలేదు.!
పాటల్లో తెలుగు సాహిత్యం గురించి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే, అంత దారుణంగా వుంది. దీనికన్నా డబ్బింగ్ సినిమాల్లోని పాటలే చాలా చాలా చాలా బెటర్.!