Dirty Media Targets Maheshbabu.. సాధారణంగా మహేష్‌బాబు ఎప్పుడూ వివాదాల్లోకెక్కడు.! నిజానికి, వివాదాలకు దూరంగా వుంటాడు. అందరితోనూ సన్నిహత సంబంధాలుంటాయి మహేష్‌బాబుకి.
కానీ, సూపర్ స్టార్ మహేష్‌బాబుని కొందరు వివాదాల్లోకి లాగుతుంటారు. సరే, సినిమా అన్నాక విమర్శలు సహజం.
అలాగే, మహేష్‌బాబు మీద కూడా ట్రోలింగ్ జరగడం.. విమర్శలు రావడం.. ఇదంతా ఓ సాధారణమైన విషయం.
వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రయత్నం.!
మహేష్‌బాబు అస్సలు కష్టపడటానికి ఇష్టపడడని ఓ చెత్త ఆర్టికల్ పోస్ట్ అయ్యింది ఓ వెబ్‌సైట్‌లో.!
కెరీర్ మొత్తం తీసుకుంటే, మహేష్ ఎప్పడూ రిస్కీ స్టంట్స్ చేయడానికే ఇష్టపడతాడు. బాల నటుడిగా వున్నప్పటి నుంచీ అదే తంతు.

మారిన పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో అందరు హీరోల్లానే మహేష్ కూడా కొంత రిస్క్ తగ్గించుకుని వుండొచ్చు.
అంతమాత్రాన, మహేష్ మీద ‘కష్టపడటానికి ఇష్టపడడు’ అంటూ బురద చల్లడం ఎంతవరకు సబబు.?
Dirty Media Targets Maheshbabu.. ఎంత ప్యాకేజీ ముట్టిందని.?
మీడియాలో వార్తలకు ఇటీవలి కాలంలో ప్యాకేజీలు సర్వసాధారణమైపోయాయి. ఎవరి మీదన్నా బురద చల్లాలంటే చాలు, అమ్ముడుపోయేందుకు మీడియా సంస్థలూ సిద్ధం.
అలా, మహేష్ మీద బురద చల్లేందుకు పెద్దమొత్తంలోనే ‘ముట్టిందట’ సదరు వెబ్‌సైట్కి. ఎవరు ఇచ్చారు.? అంటే, దానిపై భిన్నమైన కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read: Krithi Shetty.. అంతలా తిట్టొద్దు ప్లీజ్.!
ప్రధానంగా మహేష్ – పవన్ కళ్యాణ్ మధ్య స్నేహాన్ని త్రివిక్రమ్ పేరు అడ్డం పెట్టుకుని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నవారే ఈ కథంతా నడిపించారట.
రాజకీయాలకు దూరంగా వుంటాడు మహేష్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు కలిగి వుంటాడాయన.
ఏమయ్యిందోగానీ, ఓ రాజకీయ పార్టీకి పెంపుడు కుక్కలా మారిపోయిన సదరు వెబ్‌సైట్, ఆ పార్టీ పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేని మహేష్‌ని టార్గెట్ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఒక్కటి మాత్రం నిజం. జర్నలిజం కాదిది.. ఆ ముసుగులో జరుగుతున్న నిఖార్సయిన పాత్రికేయ వ్యభిచారం.!