Nabha Natesh Charlie Chaplin.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ యాక్టింగ్ పర్ఫామెన్స్ గురించి తెలిసిందే. తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’ తోనే అది ప్రూవ్ చేసుకుంది.
యాక్టింగ్ టాలెంట్ ఒక్కటే వుంటే సరిపోదు.. గ్లామర్ కూడా వుండాలి అని తెలుసుకుంది కాబోలు.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఆ లోటు తీర్చేసింది.
ఆ తర్వాత హద్దుల్లేని గ్లామర్‌తో కమర్షియల్ హీరోయిన్ అనిపించేసుకుంది నభా నటేష్. ఇక తాజాగా నభా నటేష్‌లో ఎవ్వరికీ తెలియని ఓ కళ బయటికొచ్చింది.
Nabha Natesh Charlie Chaplin.. అంతకు మించిన ఇస్మార్ట్.!
నభా నటేష్‌లో మంచి ఆర్టిస్ట్ కూడా దాగుందండోయ్. ఆర్టిస్ట్ అంటే నటన కాదండోయ్. అందంగా బొమ్మలు గీయగల క్రియేటివిటీ దాగుంది నభా నటేష్‌లో.

ఆ విషయం సోషల్ మీడియా ద్వారా నభా నటేష్ బయట పెట్టింది. నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ బొమ్మను తన స్వహస్తాలతో వేయడం ద్వారా తనలోని ఆ అపురూపమైన కళను పరిచయం చేసింది నభా నటేష్.
ఈ పెయింటింగ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. నిజంగానే నువ్వు ఇస్మార్ట్ సుమా.! అని తెగ పొగిడేస్తున్నారు నభా నటేష్‌ని.
దటీజ్ ఇస్మార్ట్ బ్యూటీ.!‘
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. నిజంగానే ఈ ఆర్ట్‌లో జీవకళ ఉట్టిపడుతోంది. చార్లీ చాప్లిన్ ఎక్స్‌ప్రెషన్‌ని అద్భుతంగా దించేసింది నభా నటేష్ (Nabha Natesh).
తెరపై ముఖానికి రంగులేసుకుని కనిపించే ఆర్టిస్టుల్లో ఇదిగో ఇలా ఎవ్వరికీ తెలియని తెర వెనకటి టాలెంట్స్ కూడా చాలా చాలా దాగుంటాయ్ మరి.
Also Read: Flora Saini Emotional Note.. లక్స్ పాప గుండె లోతుల్లోంచి.!
నాకు మ్యూజిక్ అంటే ఇష్టం.. పెయింటింగ్ వేయడం అంటే ఇష్టం.. అదిష్టం.. ఇదిష్టం.. అంటూ చాలా మంది ముద్దుగుమ్మలు చెబుతుంటారు.
కానీ, నభా నటేష్ (Nabha Natesh) మాత్రం తనలోని ఇన్నర్ టాలెంట్‌ని చెప్పకుండానే చేసి చూపించింది. హ్యాట్సాఫ్ టు యు ఇస్మార్ట్ పాపా.!
			        
														