Kodali Nani Scrap Politics.. ఆయనో మాజీ మంత్రి. ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే వున్నారు. బహుశా నోటి దురద వల్ల కలిగిన నష్టమేమో.!
చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి.! మంత్రి పదవి పోయినా, అయ్యగారి బూతులు మాత్రం తగ్గలేదు.!
పరిచయం అక్కర్లేని పేరది.! ఫైర్ బ్రాండ్ అనాలో.. బూతుల బ్రాండ్ అనాలో.! ఆయనే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.!
Kodali Nani Scrap Politics.. స్క్రాపు రాజకీయం..
టీడీపీని విమర్శించడమంటే కొడాలి నాని భలే సరదా.! ఆ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ప్రయాణం మొదలైందీయనకి.!
చంద్రబాబు దయా దాక్షిణ్యాలతో రాజకీయంగా ఎదిగిన కొడాలి నాని, ఆ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అదే రాజకీయమంటే.!

మొన్నీమధ్యన టీడీపీ మహానాడు (Telugu Desam Party Mahanadu) నేపథ్యంలో కొడాలి నాని (Kodali Nani), చంద్రబాబు (Nara Chandrababu Naidu) అండ్ టీమ్ మీద ‘స్కాపు’ విమర్శలు చేశారు.
‘స్క్రాపు నా కొడుకులు’ అనాలన్నది కొడాలి నాని భావన. నోరు తిరగక, ‘స్కాపు’ అయ్యింది. అది కాస్తా, కాపు సామాజిక వర్గానికి కోపం తెప్పించింది.
నేనలా అన్లేదు..
అబ్బే, నేనలా అన్లేదంటూ కొడాలి నాని (Kodali Nani) వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘స్క్రాపు నా కొడుకులు అన్నాను’ అని సెలవిచ్చారాయన.
ఎమ్మెల్యేవి కదా.! గతంలో మంత్రిగా కూడా పని చేశాడు కదా.! ఈ ‘నా కొడుకులు’ అనే మాట వాడటమేంటి.? ఇంగితం అనేది వుండాలి కదా.? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు.
‘నీయమ్మ మొగుడు’ అనే మాట తరచూ వాడే కొడాలి నానికి, ‘నా కొడుకులు’ అనే మాట పెద్ద కష్టమా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటోళ్ళు చాలామందే వున్నారు.!
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
టీవీ ఛానళ్లలో రాజకీయ నాయకులు మాట్లాడుతోంటే, ఆ బూతులు భరించలేకపోతున్నారు జనం.! ఇదో పనిష్మెంట్ జనానికి.! తప్పదు, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.!
అందుకే, ఓటేసేటప్పుడే.. ఎవడికి పట్టం కట్టబోతున్నామో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.! లేకపోతే, ఇదిగో.. ఇలా ‘స్క్రాప్’గాళ్ళంతా రాజకీయాల్లో రాజ్యమేలేస్తుంటారు.!