Teja Ahimsa ఒకప్పుడు తేజ అంటే సంచలన దర్శకుడు.! ఇప్పుడు తేజ అంటే, సినిమాల్ని నాశనం చేసేటోడు.!
అసలు తేజని నమ్మి ఎవరైనా ఎందుకు సినిమాలిస్తారు.? ఈ మధ్య తరచూగా వినిపిస్తోన్న మాట ఇది.!
కొన్నాళ్ళ క్రితం తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశాడు. రానా దగ్గుబాటి హీరో. కాజల్ అగర్వాల్ హీరోయిన్. అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.
Teja Ahimsa దగ్గుబాటి వారసుడ్ని ముంచేశాడు..
తాజాగా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ని (Daggubati Abhiram) హీరోగా పెట్టి ‘అహింస’ (Ahimsa) పేరుతో సినిమా తెరకెక్కించాడు తేజ.
కథ, కథనాల గురించి మాట్లాడుకోవడం దండగ.! అసలు మంచి సినిమా చేయాలన్న ఉద్దేశ్యమే తేజకి వుండి వుండదు. కేవలం ప్రేక్షకుల మీద పైశాచిక దాడి చేయడానికే సినిమా తీసినట్టున్నాడు.
పొరపాటున థియేటర్లకు వెళ్ళినవాళ్ళందరిదీ దాదాపు ఇదే మాట. సినిమాకి వెళ్ళనోళ్ళు నిజంగా అదృష్టవంతులేనని అనుకోవాలేమో.!
ఈసారి మాత్రం ప్రేక్షకుల్ని దారుణంగా హింసించాడు తేజ.! నిజానికి, తేజ ఇలా ప్రేక్షకుల్ని హింసించడం ఇదే కొత్త కాదు.
కాకపోతే, ఈసారి మరీ దారుణంగా హింస పెట్టాడు. ఇంతలా హింసించే సినిమా బహుశా ఇంకే దర్శకుడూ తీయలేడేమో.!
సురేష్ బాబు ఎలా బుక్కయ్యాడబ్బా.?
అభిరామ్ తండ్రి సురేష్ బాబు ప్రముఖ నిర్మాత. చాలా పెద్ద సినిమాలు, చాలా చిన్న సినిమాలు.. చాలా చాలా మంచి సినిమాలూ తీసిన ట్రాక్ రికార్డ్ వుందాయనకి.
యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులు చాలామంది మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అలాంటోళ్ళలో ఒకడ్నయినా తన కుమారుడి కోసం సురేష్‌బాబు ‘పిక్’ చేయకపోవడం ఆశ్చర్యకరం.
Also Read: తెలుగు సినీ పాత్రికేయ రాబందులూ.. పందికొక్కులూ.!
తేజని నమ్మాడు సురేష్‌బాబు.. అంతే అడ్డంగా బుక్కయిపోయాడు. రానా సైతం తన తమ్ముడి విషయంలో జాగ్రత్త పడి వుండాల్సింది.
సినిమా రిలీజుకి ముందు సోది మాత్రం బాగా చెబుతాడు తేజ. సినిమాల్ని మాత్రం చెడగొడతాడు. అది ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.!