Adipurush Tickets Free.. అంతా ఉచితం.! ఔను, అంతా ఉచితమే.! ‘ఆదిపురుష్’ సినిమాని ఉచితంగానే చూసెయ్యొచ్చు.!
కానీ, కండిషన్స్ అప్లయ్.! అంతే కదా మరి.! షరతులు వర్తిస్తాయి.! ఈ సినిమా చూసేందుకుగాను, అనాధలకు.. స్కూల్ విద్యార్థులకు.. ఎలాంటి రుసుము వసూలు చేయరట.
అయితే, ఇందుకుగాను 10,000 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ వెల్లడించింది.!
Adipurush Tickets Free.. అంతేనా.! ఇంకా చాలా వుంది.!
ఔనండీ, ఇంకా చాలా వుంది. పలువురు సినీ ప్రముఖులు కూడా కొన్ని టిక్కెట్లను కొనుగోలు చేసి, వాటిని కొందరికి ఉచితంగా పంచుతారట.
తాజాగా, శ్రేయస్ మీడియా సంస్థ.. ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో ఒక్కో రామాలయానికీ, 101 టిక్కెట్లను ఉచితంగా ఇవ్వబోతోందిట.!

బంపర్ ఆఫర్ అంటే ఇదే మరి.! ‘ఆదిపురుష్’ అంటే, రామాయణం.! అద్గదీ అసలు సంగతి.!
ఈ ఫ్రీ పబ్లిసిటీ స్టంట్స్ వర్కవుట్ అయ్యేనా.?
ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో టిక్కెట్లు ఉచితంగా ఇస్తే, ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్ర నిర్మాణ సంస్థకు ఏం మిగులుతుంది.?
Also Read: చిరు లీక్స్.! నువ్వు ‘భోళా శంకరుడి’వే బాస్.!
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల పరిస్థితేంటి.? వాళ్ళకేమీ కాదు.. సమస్య నిర్మాతకే రావొచ్చు. అయితే, ఈ పబ్లిసిటీ వర్కవుట్ అయితే.. సినిమాకి వసూళ్ళ పంట పండుతుందనుకోండి.. అది వేరే సంగతి.!
ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాకి ఓం రౌత్ దర్శకుడు.! జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.