Mirnalini Ravi Saree Styling.. ‘బుజ్జమ్మ’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలీ ముద్దుగుమ్మ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది.
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు, మిర్నాలినీ రవి. తెలుగు, తమిళ భాషల్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందీ అందాల భామ.
తొలి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసింది. తమిళంలో ‘సూపర్ డీలక్స్’ మూవీతో ప్రూవ్ చేసుకుంది. తెలుగులో ప్రస్తుతం ‘మామా మశ్చింద్ర’ సినిమాలో నటిస్తోంది.
Mirnalini Ravi Saree Styling.. షరతులు వర్తిస్తాయ్..
సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో వస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కాగా, అందులో ఓ హీరోయిన్‌గా మిర్నాలిని రవి నటిస్తోంది.

కాగా, సినిమాలపై వున్న ఇంట్రెస్ట్‌తో ఏకంగా లక్షల్లో జీతం వచ్చే సాప్ట్‌వేర్ వుద్యోగాన్నే వదిలేసుకుంది మిర్నాలిని. ఫుల్ టైమ్ యాక్ర్టస్‌గా కొనసాగాలన్నదే మిర్నాలిని కలట.
అలా అని ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేసేయబోను అంటోందీ క్యూట్ బ్యూటీ. సెలెక్టివ్‌గా పాత్రకు ప్రాధాన్యత వున్న పాత్రలనే ఎంచుకుంటానంటోంది.
అమ్మడిలో ఆ టాలెంట్ కూడా వుందండోయ్.!
హీరోయిన్ కాకముందే, సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలూ గట్రా చేస్తూ తనదైన నటనా ప్రతిభను చూపించిందదీ అమ్మడు.
Also Read: Adipurush Bookings.. ప్రేక్షక దేవుళ్ళే భక్తులైతే.!
ఇక, ఇప్పుడు వెండితెరపై ఆ టాలెంట్ బయట పెడుతోంది. సోషల్ మీడియాలో మరీ టూ మచ్ హాట్‌గా కాకపోయినా, ఓ మోస్తరు గ్లామర్‌తో కుర్రకారుకు గ్లామర్ వలలు విసిరే మిర్నాల్ తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
బ్లాక్ శారీలో చిరు నవ్వులు చిందిస్తూ ఫోటోలకి పోజిచ్చింది. ఈ శారీకి మిర్నాల్ ధరించిన అల్ట్రా మోడ్రన్ బ్లౌజ్ హైలైట్‌గా నిలిచింది.