Koratala Siva Devara.. దర్శకుడు కొరటాల శివ అంటే, ‘ఆచార్య’ సినిమాకి ముందు వరకూ, ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు.!
కానీ, ‘ఆచార్య’ (Acharya Movie) సినిమా అన్ని లెక్కల్నీ మార్చేసింది. కొరటాల శివ (Director Koratala Siva) మీద బోల్డన్ని విమర్శలు వచ్చాయ్.
అదంతా గతం.! ఇప్పుడేమో, ‘దేవర’ (Devara) సినిమాతో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ మీదకు ఎక్కుతాననే ధీమాతో వున్నాడు కొరటాల శివ.
Koratala Siva Devara.. ఒక్క సినిమాతోనే అంతా..
ఒకే ఒక్క సినిమా కొరటాల శివని (Koratala Siva) దారుణంగా దెబ్బ తీసింది. సినిమా రంగంలో సక్సెస్, ఫెయిల్యూర్ అన్నవి మామూలే.

రాజమౌళి మాత్రమే ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడలేదు. కొన్ని కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే విమర్శలొచ్చినా.. రాజమౌళి జోరుని తగ్గించలేకపోయాయ్ అవి.
కొరటాల శివ విషయంలో అలా కాదు. ‘ఆచార్య’ (Acharya Movie) డిజాస్టర్. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్.
చరణ్.. చిరంజీవి.. కలిసినా..
తప్పెక్కడ జరిగింది.? అంటే, ప్చ్.. చెప్పలేం. కానీ, తప్పు జరిగిపోయింది. మెగా కాంబినేషన్ అది.. దాన్ని కొరటాల శివ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఫ్లాప్ అయితే.. అదో లెక్క.! కానీ, డిజాస్టర్ అయి కూర్చుంది. కోవిడ్ సహా అనేక కారణాలు.. అవన్నీ కుంటి సాకులుగానే మిగిలిపోతాయ్.
Also Read: బాబూ ‘అన్స్టాపబుల్’ సన్నీ.! బిర్యానీ టేస్ట్ తెలుసా నీకు.?
‘ఆచార్య’ నుంచి చిరంజీవి కోలుకున్నారు.. కానీ, కొరటాల శివ (Koratala Siva) కోలుకున్నాడో లేదో తెలియాలంటే, ‘దేవర’ (Devara) విడుదలవ్వాల్సిందే.!