Table of Contents
Adipurush Review yeSBee.. ఓం రౌత్ దర్శకత్వంలో మోడ్రన్ ‘రామాయణం’ తెరకెక్కింది.
వాల్మీకి రామాయణం నుంచి తమక్కావాల్సిన కొంత భాగాన్ని (కొన్ని భాగాల్ని) తీసుకున్నారు ‘ఆదిపురుష్’ కోసం.!
రాముడంటే ఎలా వుండాలి.? సీతమ్మ ఎలా వుంటుంది.? రావణుడి మాటేమిటి.? హనుమంతుడి రూపం.. ఇలా చాలా విషయాల గురించి అధ్యయనాలు అక్కర్లేదు.!
గతంలో చాలా సినిమాలు వచ్చాయ్.. వాటికి మించి, బుల్లితెర ధారావాహికలూ అందుబాటులోనే వున్నాయ్.
నిజానికి, కొత్తగా ఏం చేయనక్కర్లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పద్ధతిగా వాడుకుంటే సరిపోతుంది. ఇంతకీ, ఓం రౌత్ ఏం చేశాడు.? కక్కుర్తి పడ్డాడు.! అలాగే ఓవరాక్షన్ కూడా చేశాడు.
Adipurush Review yeSBee.. ఇదా రామాయణం అంటే.?
కొత్తగా పరిచయం చెయ్యాలా రామాయణం (Ramayan) గురించి.? ఏ పాత్ర తీసుకున్నా, ఆ పాత్రకు బోల్డంత ప్రాధాన్యముంటుంది.

మనం ఎలా వుండాలో, ఎలా వుండకూడదో రామాయణంలోని పాత్రలు చెబుతాయి. అదొక జీవన విధానం.
అన్న మాట జవదాటని తమ్ముడు.. ప్రజల పట్ల బాధ్యత గలిగిన ప్రభువు.. పర స్త్రీ వ్యామోహంలో పడిపోయి రాక్షసుడిగా మారిన రావణ బ్రహ్మ.. ఇలాంటి పాత్రలు.! ఒకటా.? రెండా.? బోల్డన్ని.!
Adipurush Review yeSBee.. ఇక్కడేంటి ఇలా.?
హనుమంతుడి తోకకు నిప్పు పెడితే, రాయల సీమ ఫ్యాక్షన్ తరహా డైలాగు వినిపిస్తుందక్కడ.. అదీ హనుమంతుడి నోట.!
ఇదొక్కటి చాలు, సినిమాని దర్శకుడు ఏ కోణంలో తీసుకున్నాడో చెప్పడానికి. వానరులంటే.. అవేవో వింత జీవులన్నట్టు.. లంక వాసులంటే.. వాళ్ళని ఏకంగా ఏలియన్స్ అన్నట్టు చూపించారు.

మీకు తెలిసిన రామాయణం వేరు.. మేం తీసిన రామాయణం వేరు.. అన్నట్టుగా, ఏదో హాలీవుడ్ సినిమా తాలూకు మైకంలో పడిపోయి, ‘మార్వెల్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్..’ లాంటి సినిమాలు చూపించేశాడు ఓం రౌత్.
ఆ వీఎఫ్ఎక్స్ పైత్యమేంటోగానీ.. సినిమాలో దైవత్వం అనేదే ఎక్కడా కనిపించదాయె.!
సినిమా మొదలైన కాస్సేపటికే, మనం చూడ్డానికి వచ్చింది ‘ఆదిపురుష్’ సినిమానేనా.? అన్న సందేహం కలుగుతుంది.
ఆ పాత్రలేంటి.? ఆ బొమ్మలేంటి.? ఆ పైత్యమేంటి.?
మనుషులు కాని మనుషులు.. జంతువులు కాని జంతువులు.. అర్థం పర్థం లేని పాత్రల స్వభావం.. వెరసి, రామాయణాన్ని చెడగొట్టడానికే ‘ఆదిపురుష్’ సినిమాని ఓం రౌత్ తెరకెక్కించినట్లున్నాడు.
అయినా, ప్రభాస్ (Prabhas) తెలుసుకోవద్దా.? రామాయణాన్ని చెడగొట్టే సినిమాలో నటిస్తే.. తన కెరీర్ మీద ఎంతటి దారుణమైన మచ్చ పడుతుందో.!
కొంతమంది ‘మూడు’ రేటింగులేసి.. ముప్ఫయ్ మూడు వంకలెట్టారు. అసలు రేటింగ్ వెయ్యాలా.? వద్దా.? అన్న సందేహం చాలామందికి రివ్యూలు రాస్తున్నప్పుడే అనిపించి వుండొచ్చు.
Also Read: వైరల్ వీడియో.! జింకలు పాముల్ని తింటాయా.?
రామాయణం (Ramayanam) స్ఫూర్తి దెబ్బ తినకూడదన్న సోయ లేకుండా దర్శకుడు ఓం రౌత్ తీసిన సినిమా ఇది.!
ప్రభాస్ (Prabhas) మీద ఎలా తీసినా, సినిమా సేల్ అయిపోతుందనుకున్నారో ఏమో.. చెత్త తీసి, జనం మీదకు వదిలేశారు.

సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. దేనికదే కొన్ని చోట్ల అత్యద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తే, కొన్ని చోట్ల చతికిలపడ్డాయ్. వీఎఫ్ఎక్స్ కూడా అంతే. ఎడిటింగ్ అయితే చాలా లోపాలతో వుంది.
ఇలాంటి ఓ సినిమా రామాయణం మీద వస్తుందని.. దానికి ఇలాంటి రివ్యూ రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.!
చివరగా.. ఇలాంటి సినిమాకి (Adipurush) ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.! నవ్విపోదురుగాక.!
– yeSBee