Apsara Rani RGV Shivi.. ఆర్జీవీ తెలుసు కదా.? అదేనండీ, రామ్ గోపాల్ వర్మ.! మరి, శివి ఎవరు.? ‘శివ’కి ఫిమేల్ వెర్షన్.!
అక్కినేని నాగార్జునతో ‘శివ’ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), ఇప్పుడు ‘శివి’ తీయబోతున్నాడేమో.!
ఆ శివి ఎవరో కాదు, అప్సర రాణి.! అంతకు ముందు ఏదో పేరుతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత అప్సర రాణిగా పేరు మార్చుకుంది.
Apsara Rani RGV Shivi.. ఆర్జీవీ మార్చేశాడు..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఓ సినిమాలో.. కాదు కాదు రెండు మూడు సినిమాల్లో నటించిందట అప్సర రాణి (Apsara Rani).
కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందండోయ్.! ఆర్జీవీ (Ram Gopal Varma) వల్లనే తనకు బ్రేక్ వచ్చిందని నమ్ముతోందీ బ్యూటీ.

నటన సంగతెలా వున్నా, అందాల ప్రదర్శనలో అస్సలు మొహమాటపడదు. ఆర్జీవీకి కావాల్సింది కూడా అదే కదా.!
అన్నట్టు, ఆర్జీవీ ఈ మధ్య ‘డెన్’ ఓపెన్ చేశాడు. అందులో అప్సర రాణి, ‘శివ’ (Shiva Movie) సినిమా పోస్టర్ ముందు పోజులిచ్చింది.
Also Read: Divyansha Kaushik.. అందాల మజిలీ.!
‘శివ’ సినిమాలో నాగార్జున (Akkineni Nagarjuna) తరహాలో పోజు పెట్టేసరికి, ఆర్జీవీ ‘శివి’ అని పేరు పెట్టేశాడు. అదీ అసలు సంగతి.!
అదిరింది కదా.. ఆర్జీవీ (Ram Gopal Varma), శివి.. సరిపోయారు ఇద్దరూ.!