Samantha Health Issue Myositis.. ఔనా.? నిజమా.? సమంత, సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా.? జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమేనా.? నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్టేనా.?
బోల్డన్ని గాసిప్స్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి సమంత సినిమా కెరీర్ విషయంలో.
ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది సమంత. ఓ సినిమా సమంత చేయాల్సి వుండగా, అది కాస్తా చేతులు మారింది.
‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇంకా స్ట్రీమింగ్ షురూ అవలేదు.
Samantha Health Issue Myositis.. అదే అసలు సమస్య..
సమంత ‘మయోసైటిస్’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ కారణంగానే, తీవ్ర ఇబ్బంది పడుతోంది.. మానసికంగా, శారీరకంగా కూడా.!

మయోసైటిస్ నుంచి సమంత కొంత మేర కోలుకున్నా, పూర్తిగా కోలుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదన్నది ఓ వాదన.
‘యశోద’ సినిమా సమయంలోనే మయోసైటిస్ అంశం తెరపైకొచ్చింది. ఆ తర్వాత కోలుకుంది, ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ షురూ చేసింది.. ‘ఖుషీ’ సినిమా పనుల్నీ చక్కబెట్టింది సమంత.
ఇంతకీ.. అసలేమయ్యింది.?
కోలుకున్నట్టే కనిపించిన సమంత, ఎందుకిప్పుడు ‘బ్రేక్’ తీసుకోవాలనుకుంటున్నట్టు.? నిర్మాతలకు అడ్వాన్సుల్ని తిరిగిచ్చేస్తోందంటూ సమంతపై ఎందుకు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయ్.?
ఏమోగానీ, సమంత సినిమాలక గుడ్ బై చెప్పేస్తోందన్న ప్రచారమైతే ఆమె అభిమానుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.