Deepika Padukone ProjectK.. ప్యాన్ ఇండియా హీరో ప్రబాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
నాగ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీ దత్ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. కంటెంట్‌తో పాటూ, మంచి కటౌటున్న హీరో ప్రబాస్.
ఆ ప్రబాస్ కటౌట్‌కి ఏ మాత్రం తగ్గకుండా, ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనెను ఎంచుకున్నారు. దీపిక ఫస్ట్‌లుక్‌ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Deepika Padukone ProjectK.. ఇది చాలదు ఇంకా కావాలి దీపికా..
యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రలు అత్యంత ప్రత్యేకంగా డిజైన్ చేయబడి వుంటాయని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
అయితే, తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన దీపికా పదుకొనె (Deepika Padukone) ఫస్ట్ లుక్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫేస్ మాత్రమే రిలీజ్ చేశారు ఈ పోస్టర్‌లో.

సీరియస్ లుక్స్‌లో కనిపిస్తోంది దీపికా పదుకొనె. ఈ లుక్స్‌తో, ఈ సింపుల్ కటౌట్‌తో ఆమె పాత్రపై ఎలాంటి అభిప్రాయానికి రాలేమన్నదే ఆడియన్స్ రివ్యూ.
సో, ఇంకాస్త ఇంటెన్స్ లుక్‌ని రిలీజ్ చేసి వుంటే బావుండేదని ఫ్యాన్స్ ఒపీనియన్.
అప్పుడే హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెఢీ.!
ఇదిలా వుంటే, ఈ నెల 20న అమెరికాలో జరగబోయే ప్రఖ్యాత శాన్ డియాగో కామిక్ కాన్ వేదకపై ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించబోతోంది.
ఇదే వేదికపై ‘ప్రాజెక్ట్ కె’ (ProjectK) టైటిల్ మరియు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్నారట. ‘ఈ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తికరమైన షో కోసం వేచి చూస్తోంది..
ప్రాజెక్ట్ కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు సిద్ధంగా వుండండి.. అని గత కొన్ని రోజుల క్రితమే చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ప్రబాస్, దీపికతో పాటూ, ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
Also Read: Tomato Price Hike.. ట‘మోత’ మోగిపోతోంది.! ఇదో పిచ్చి.!
అలాగే, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ‘ప్రాజెక్ట్ కె’లో భాగం కానున్నారు.