Vishwak Sen Baby Controversy సినిమా అంటేనే ఓ మ్యాజిక్.! పెద్ద పెద్ద హీరోలే కొన్ని ప్రాజెక్టుల్ని వదిలేసుకుంటుంటారు.. అవి పెద్ద పెద్ద హిట్స్ అయిన సందర్భాలుంటాయ్.!
ఒక్కోసారి ఆయా హీరోలు మిస్ అయిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయ్ కూడా.! హిట్టూ ఫ్లాపు.. ఇవన్నీ సినీ పరిశ్రమలో మామూలే.!
ఓ హీరో ఓ సినిమా కథని తిరస్కరించాడు. అది కూడా కథ వినకుండానే.! దానికి ఆ కథని నమ్ముకున్న దర్శకుడు ఫీల్ అయ్యాడు.
కథ విని ‘నచ్చ లేదు’ అని చెబితే, అది వేరే లెక్క. ‘ఆడి సినిమా అయితే అస్సలు చేయను..’ అనడం మాత్రం ఘోరం.! అహంకారం.!
‘బేబీ’ సినిమా విషయంలో దర్శకుడు సాయి రాజేష్‌కి ఎదురైన పరిస్థితి ఇది. అదీ విశ్వక్ సేన్ కారణంగానే.! ముసుగులో గుద్దులాట ఏమీ లేదు. అంతా ఓపెన్ అయిపోయింది.
Vishwak Sen Baby Controversy.. భుజాలు తడుముకున్న దాస్.!
సాయి రాజేష్ ఎక్కడా విశ్వక్ సేన్ పేరు ప్రస్తావించలేదు. కానీ, విశ్వక్ సేన్ భుజాలు తడుముకున్నాడు. అయితే, విశ్వక్ సేన్ కూడా, ‘బేబీ’ సినిమా పేరుని ప్రస్తావించలేదు.
సరే, ఖాళీ లేకపోతే.. సినిమా చేసే ఉద్దేశ్యం లేకపోతే.. దాన్ని ఇంకో రకంగా డీల్ చేసి వుండొచ్చు విశ్వక్ సేన్.! ‘ఆడి సినిమా అయితే చేయను’ అనడమే బాగాలేదు.
‘నేనేమీ బిర్యానీని కాదు, అందరికీ నచ్చేలా వుండటానికి..’ అని విశ్వక్ సేన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం.

‘నాకూ కొన్ని ఆలోచనలు వుంటాయ్. కొన్ని కొన్ని కుదరవు అంతే. పెద్ద హీరోని కాకపోయినా, నాకూ చాలా వ్యాపకాలుంటాయ్.. ఆ బిజీలో కలవలేకపోయాను..’ అన్నది విశ్వక్ సేన్ ఇచ్చుకున్న వివరణ.
‘బేబీ’ సినిమా ‘స్లో’గా వుందనే కామెంట్స్ తొలి రోజు వచ్చినా, అది నిజమే అయినా.. అంచనాలను మించిన విజయాన్ని అందుకుంది.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఇది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా.
మాస్ కా దాస్ కాదు.. బేబీ.. జుజుబీ.!
విశ్వక్ సేన్ చేసి వుంటే, సినిమా ఏమయ్యేది.? అన్నది వేరే చర్చ.
గతంలోనే, ఈ సినిమా వ్యవహారంపై పరోక్షంగా ‘నో మీన్స్ నో’ అని ట్వీటేసిన విశ్వక్, తాజాగా ఈ సినిమాపై స్పందించి, వివాదాన్ని మళ్ళీ రాజేసినట్లయ్యింది.
Also Read: Manipur Women Violence.. సిగ్గు పడదాం.! కానీ, ఎలా.?
మరి, సాయి రాజేష్ కూడా స్పందిస్తాడా.? విశ్వక్ సేన్‌కి కౌంటర్ ఎటాక్ ఇస్తాడా.?
‘మన సినిమా హిట్టయితే తలెత్తుకు తిరగొచ్చు.. ఎదుటి వ్యక్తిని కించపర్చకూడదు కదా.? అంటోన్న విశ్వక్ సేన్‌కి సాయి రాజేష్ ఇచ్చే కౌంటర్ ఎటాక్ ఎలా వుండబోతోందో.?
అన్నట్టు, విజయ్ దేవరకొండతోనూ విశ్వక్ సేన్‌కి పంచాయితీ వుంది. అదిప్పుడు, ఆనంద్ దేవరకొండ సినిమా వరకూ వచ్చినట్లయ్యింది.!