Home Remedies For Dandruff.. ఈ జనరేషన్ యువతను వేధిస్తోన్న సమస్యల్లో డేండ్రఫ్ సమస్య ఒకటి. పెరిగిపోయిన కాలుష్యం, టెన్షన్ లైఫ్.. ఇలా డేండ్రఫ్ తలెత్తడానికి అనేక కారణాలుగా చెప్పొచ్చు.
డేండ్రఫ్ అత్యంత చికాకు పెట్టే సమస్య మాత్రమే కాదు.. ఈ సమస్య కారణంగా జుట్టు దారుణంగా రాలిపోతుంటుంది. ఇదో రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల షాంపూలు అందుబాటులో వున్నప్పటికీ, అవన్నీ తాత్కాలిక పరిష్కారాలే.
Home Remedies For Dandruff. ఇంటి చిట్కాలతోనే డేండ్రఫ్‌కి చెక్..
చుండ్రు సమస్యను తీర్చుకునేందుకు నేచురల్ మార్గం ఇంటి చిట్కాలే అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చాలా సింపుల్‌గా ఇంటి చిట్కాలతో చుండ్రు సమస్య నుంచి బయట పడొచ్చు. కలబంద సాధారణంగా అందరి ఇంట్లోనూ ఈజీగా పెరిగే మొక్క.
కలబంద గుజ్జును చుండ్రు సమస్యకు మంచి పరిష్కారంగా చెబుతున్నారు. అలాగే, నిమ్మ కాయ రసంతోనూ చుండ్రుకు చెక్ పెట్టేయొచ్చు.
కలబంద గుజ్జు కానీ, నిమ్మ రసం కానీ, తలకు బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు సమస్య తీరుతుంది. పుదీనా పేస్ట్ కూడా ఈ సమస్యకు బాగా పనికొస్తుంది.
చుండ్రు సమస్యకు మెంతులు చేసే మేలు..
నానబెట్టిన మెంతుల పేస్ట్‌ని వారంలో రెండు సార్లు క్రమం తప్పకుండా వాడితే, చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
Also Read: Health Benefits Of Amla.. ఉసిరి.. ఔషధ సిరి.!
వేపాకుల్ని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించినా మంచి ఫలితం వుంటుంది. పెరుగు, ఉసిరి పొడి మిశ్రమంతోనూ డేండ్రఫ్‌కి చెక్ పెట్టొచ్చు.

ఏ చిట్కా చేసినా, క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు పాటిస్తేనే ఫలితం వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం, కొందరు వైద్య నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. సొంత వైద్యం ప్రమాదకరం కావచ్చు.. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సంలనం.