Pawan Kalyan Remuneration BRO.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్‌ని ‘బ్రో’ సినిమా కోసం ఎలా తీసుకున్నారు.?
మొత్తంగా అంతా వైట్ మనీయేనా.? కొంత బ్లాక్ మనీ ఏమైనా వుందా.? విదేశాల నుంచి అక్రమంగా తరలించబడిన నిధుల నుంచి.. (అంటే, మనీ లాండరింగ్) ఇచ్చారా.?
సోషల్ యూనివర్సిటీ.. పుణ్యమా అని పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ వంద కోట్ల పై మాటేనంటూ ‘వార్తలు’ చక్కర్లు కొడుతున్నాయి.
Pawan Kalyan Remuneration BRO.. రోజుకి రెండు కోట్లు..
‘ప్రస్తుతం చేస్తున్న ఓ సినిమాకి రోజుకి రెండు కోట్లు వస్తోంది.. అదలా కుదిరింది. అన్నిసార్లూ కదురకపోవచ్చు..’ అంటూ ‘బ్రో’ చిత్రీకరణ సమయంలో పవన్ చెప్పుకొచ్చారు.
అది కూడా రాజకీయ వేదికపై.! తన సంపాదన.. ఆ సంపాదన ద్వారా పార్టీ నడుపుతున్న వైనం గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ క్రియాశీల కార్యకర్తల ఇన్స్యూరెన్స్ కోసం అలాగే కౌలు రైతుల కుటుంబాల కోసం వెచ్చిస్తున్న మొత్తం.. ఈ ప్రస్తావన పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది.
నలభై కోట్లా.? యాభై కోట్లా.?
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ వ్యవహారం రాజకీయాల్లో వివాదంగా మారింది. దాంతో, అసలు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.? అన్న చర్చ తెరపైకొచ్చింది.
‘అది మా సంస్థకీ, పవన్ కళ్యాణ్‌కీ మధ్య కుదిరిన అగ్రిమెంట్.. మేం ఎవరి పన్నులు వారు కడతాం. అంతే, తప్ప, ఇంకెవరికీ ఈ విషయమై సమాధానాలు చెప్పం’ అని ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ కుండబద్దలుగొట్టేశారు.

అంతేనా, ఈ విషయమై తమ మీద చేస్తున్న ఆరోపణలకుగాను చట్టపరమైన చర్యలకు దిగితే, ఆరోపణలు చేసేవారి సంగతి తేలిపోతుందంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు టీజీ విశ్వ ప్రసాద్.
Also Read: Sobhita Dhulipala.. స్వర్గంలో చెక్కబడిన తెలుగు సోయగం.!
ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ.. పవన్ కళ్యాణ్ వెనకాల ఓ నిర్మాత ఇంత బలంగా నిలబడటం అనేది ఇటీవలి కాలంలో ఇదేనేమో.!
‘నేను పవన్ కళ్యాణ్ అభిమానిని..’ అని చెప్పుుకుంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ కోసం నిలబడగలగాలి. ఈ విషయంలో టీజీ విశ్వ ప్రసాద్‌కి హేట్సాఫ్ చెప్పాల్సిందేనేమో.!