Sherlyn Chopra Marriage Gandhi.. ఎక్స్‌పోజింగ్, వల్గారిటీ.. ఇలాంటి మాటలకు హద్దులెప్పుడో చెరిపేసింది హైద్రాబాదీ బ్యూటీ షెర్లీన్ చోప్రా.!
తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో కనిపించిన షెర్లీన్, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు తక్కువే కానీ, పబ్లిసిటీ స్టంట్లు గట్టిగా చేసింది.
అట్నుంచి ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం న్యూడిటీకి సైతం ‘సై’ అనేసిన షెర్లీన్ చోప్రా, సోషల్ మీడియా వేదికగా మరింతగా చెలరేగిపోయింది.
Sherlyn Chopra Marriage Gandhi.. రాహుల్ గాంధీతో పెళ్ళంట..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పెళ్ళాడితే.? అన్న ప్రశ్న ఉత్పన్నమైందామెకి. చాలా తెలివిగా సమాధానమిచ్చింది ఆ ప్రశ్నకి షెర్లీన్ చోప్రా.

‘ఏం, ఎందుకు చేసుకోకూడదు.? అవకాశమొస్తే, రాహుల్ గాంధీని పెళ్ళి చేసుకుంటా..’ అంటూ షెర్లీన్ చోప్రా సెలవిచ్చింది.
ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురించి చెబుతారు. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం రాహుల్ గాంధీకి లేదు.
ఓ కండిషన్..
రాహుల్ గాంధీని పెళ్ళాడాక, తన పేరు షెర్లీన్ గాంధీగా మార్చుకోవడానికి ఇష్టపడననీ, అప్పుడు కూడా తన పేరు షెర్లీన్ చోప్రా అనే వుంటుందనీ చెబుతోందామె.
చాలా దూరం వెళ్ళిపోయింది కదా షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra).! అసలు ఇలాంటి ప్రశ్నల్ని మీడియా అడగడమే హాస్యాస్పదం.!
మీడియా అడిగాక, సెటైర్లేయడం మామూలే కదా.! షెర్లీన్ చోప్రా చేసిందదే.! ఇంతకీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్ళెప్పుడు.? ప్చ్.. కష్టమే.! కాదు అసాధ్యమే.!