Table of Contents
Tirumala Cheetah Devotees Stick.. అనగనగా ఓ అడవి.! ఆ అడవిలో ఓ దేవాలయం.! అడవి కదా.. అక్కడ వన్యమృగాలుంటాయ్.!
దేవుడి కోసం వెళ్ళే జనం జాగ్రత్తగా వుండాలి కదా.! దేవాలయాన్ని నిర్వహిస్తున్నోళ్ళు ఇంకెంత బాధ్యతగా వుండాలి.?
వన్య మృగం ఒకటి, ఓ చిన్నారి భక్తురాల్ని చంపేసింది.! దానికేం తెలుసు.? తన ఆహారం అనుకుంది అడవి జంతువు.!
ఏం చేయాలిప్పుడు.? భద్రత పెంచాలి.! అంతేగానీ, భక్తుల చేతికి కర్రలు ఇస్తే కుదురుతుందా.? తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయమిది.
టీటీడీ బోర్డు కొత్త ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మారిపోయింది.
లక్షల సంఖ్యలో కర్రలు..
ఒకటా.? రెండా.? వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కర్రలిప్పుడు కొనుగోలు చేయాలేమో.! ఇంతకీ, ఇదేమన్నా ‘ఉపాధి హామీ పథకం’ లాంటిదా.?
చేతి కర్ర.. ఊత కర్ర.! పేరు ఏదైతేనేం.. అదో కర్ర.! ఇంతకీ, కర్రల సేకరణ కోసం టెండర్లు పిలుస్తారా.? అయినవాళ్ళకే ‘ఆర్డర్లు’ ఇచ్చుకుంటారా.?
దేవాలయ పాలక మండలి.. అంటేనే, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం అయి తగలడిందాయె.!
సో, ఈ కర్రల కాంట్రాక్టు కూడా, అధికార పార్టీకే దక్కుతుందండోయ్.! భలే ప్లాన్ చేశారు కదా.! కర్రల సంగతి పక్కన పెడితే, వన్య మృగాలెందుకు జనం మీద పడుతున్నాయ్.?
Tirumala Cheetah Devotees Stick.. ఎర్ర చందనానికీ లింకు..
లోపల.. ఆ అడవిలో ఎర్రచందనం వుందండోయ్.! ఆ ఎర్ర చందనాన్ని అక్రమంగా ఎత్తుకెళ్ళే దొంగలు.. వాళ్ళ హంగామా నడుమ, వన్య మృగాలు అక్కడి నుంచి బయటకొస్తున్నాయన్నది ఓ వాదన.
ఇంకో వాదన ఏంటంటే, భక్తులు.. దారిలో శాఖాహారులైన జంతువులకి మేత పెడుతున్నారనీ, ఆ కారణంగా గుమికూడే సాధు జంతువుల్ని తేలిగ్గా వేటాడేందుకు మాంసాహార జంతువులు వస్తున్నాయనీ అంటున్నారు.

తప్పెవరిది.? నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం లభించే దేవాలయం.. భక్తుల భద్రతనీ, వన్యమృగాల సంరక్షణనీ విస్మరిస్తే ఎలా.?
ఏదో చేస్తున్నాం.. అని చెప్పుకోవడానికి ఈ ‘కర్ర కాన్సెప్టు’ ఒకటి.! ఇంతకీ, కర్రలు ఉచితంగా ఇస్తారా.? వాటికీ ధరలు నిర్ణయించి, భక్తుల నుంచి వసూలు చేస్తారా.?
దేవుడి ప్రసాదాన్నే అమ్మేసుకుంటున్నారు..
దేవుడి ప్రసాదాన్నే అమ్మేసుకుంటున్న ప్రభుత్వాలు, దేవాలయాల పాలక మండళ్ళు.. భక్తుడి జేబుకి ‘కర్రల ఖర్చు’ రూపంలోనూ చిల్లు పెట్టకుండా వుండవ్.!
అందుకే, పులీ పారిపో.! భక్తుల మీద కాస్త దయ చూపించు.! భక్తుల జేబుల మీదా.. భక్తుల ప్రాణాల మీదా.. కాస్తంత బాధ్యతగా నువ్వైనా వ్యవహరించు.!
Also Read: న్యూసూ న్యూసెన్సూ! ఎనకటి రెడ్డిగాడి పెళ్ళాం లేచిపోయిందట!
లేదంటే, ఖర్చయినా ఫర్లేదు.. కర్ర ఝుళిపించేస్తాం.! ఏంటీ, కర్ర చూపిస్తే, క్రూర మృగం పారిపోతుందా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
పేనుకి పెత్తనమిస్తే…! కుక్క పెత్తనం.! ఇవన్నీ పెద్దలు చెప్పే మాటలే.! ఇంతకీ, ఈ ‘కర్ర’ పెత్తనాన్ని ఏమనాలి.?
