Table of Contents
Ramoji Rao Telugu Animutyam.. అరరె.! తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరేసింది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు కాదుట.! రామోజీరావు అట.!
అంతా టీడీపీ ఇష్టం.! ఇప్పుడైతే, తెలుగు జాతి ఆత్మగౌరవం అనగానే, రామోజీరావు గురించే చెప్పాలి.! అలాగని, టీడీపీ హుకూం జారీ చేసింది.
తెలుగు భాషకి వన్నె తెచ్చిన.. తెలుగు నేలకు వన్నె తెచ్చినా.. ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలు రామోజీరావు గురించి జాలువారుతున్నాయి సోషల్ మీడియాలో.
Ramoji Rao Telugu Animutyam.. జర్నలిస్టు.. వ్యాపారవేత్త.. అంతే కదా.!
రామోజీరావు అంటే, పాత్రికేయుడు.! ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. అంతే కాదు, వ్యాపారవేత్త కూడా.!
ఓ ఫిలిం సిటీ వుంది. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ వుంది.. అంతేనా, పచ్చళ్ళ వ్యాపారం కూడా వుందండోయ్.!
నిజమే, తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు ఓ సంచలనం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మీడియా మొఘల్ అనే పేరూ వుందాయనకి.
ఉషాకిరణ్ బ్యానర్ ద్వారా పలు సినిమాల్ని కూడా రామోజీరావు నిర్మించిన సంగతి తెలిసిందే.!
అంతమాత్రాన.. కీర్తి పతాకం.. అయిపోతుందా.?
తెలుగు భాషకు తెగులు పట్టించిందే ‘ఈనాడు’ అంటారు కొందరు.! చిట్‌ఫండ్ వ్యాపారం ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు రామోజీరావు మీదున్నాయ్.
ఇక, రామోజీ ఫిలింసిటీ భూముల వివాదం సంగతి సరే సరి.! ఈనాడులో కనిపించే రాజకీయ వార్తలు, అది కక్కే రాజకీయ విషం గురించీ చాలా విమర్శలున్నాయ్.
రామోజీరావుకి ఎన్నో ఘనతలు వుండొచ్చు.. కొందరు ఆయన్ని గొప్ప వ్యక్తి.. అని కీర్తించొచ్చు. ఇంకొందరు, ఆయన్ని విమర్శించొచ్చు.! ఎవరిష్టం వారిది.
అంతేగానీ, తెలుగు జాతి మొత్తం రామోజీరావు వెనకాల వుంటుందని స్టేట్మెంట్లు పాస్ చేయడం అర్థరహితం.!
తెలుగుదేశం పార్టీకి రాజగురువు.!
తెలుగు జాతి అంటే, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అనే జాతి కాదు.! తెలుగు నేల అంటే, తెలుగు ప్రజలు.! తెలుగునాట ఎందరో మహానుభావులున్నారు.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
రామోజీరావు, తెలుగు దేశం పార్టీకి ఆణిముత్యం అయితే అయి వుండొచ్చుగాక.! టీడీపీ రాజగురువు గనుక, ఆ పార్టీ ఆయన్ని ఆణిముత్యంలా భావిస్తుండొచ్చు.. తప్పు పట్టలేం.!
కానీ, అభియోగాలు వచ్చాక, ‘మార్గదర్శి స్కామ్’ అంటూ రచ్చ జరుగుతున్నాక.. నిజాలు నిగ్గు తేలాలి.! అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడం ఎవరికీ మంచిది కాదు.!