DK Aruna Gadwal Telangana.. ఆమెను జేజెమ్మగా కొందరు భావిస్తుంటారు.! ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో వున్నారు.! గతంలో కాంగ్రెస్ నేత.. పైగా, మంత్రిగా కూడా పని చేశారామె.
పరిచయం అక్కర్లేని పేరామెది.! ఆమె ఎవరో కాదు, డీకే అరుణ.! రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనదగ్గ మహిళా నాయకుల్లో ఆమె కూడా ఒకరు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.! అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.!
గెలిచిన అభ్యర్థికి సంబంధించి, తాజాగా న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారన్నది ఆయన మీద మోపబడ్డ అభియోగం.
DK Aruna Gadwal Telangana.. డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.!
ప్చ్.. వ్యవహారం తేడా కొట్టేసింది.. ఆయన ఎన్నిక చెల్లదని న్యాయస్థానం తేల్చేయడంతో, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణని ఎమ్మెల్యేగా న్యాయస్థానం ప్రకటించింది.
ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికయినట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిర్దేశించింది.
సో, ఇప్పుడిక జోగులాంబ జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నమాట.! ఎప్పుడో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఇప్పుడు ఇన్నేళ్ళకి.. వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.
అప్పట్లో గెలిచిన అభ్యర్థికి న్యాయస్థానం రెండున్నర లక్షల రూపాయల జరీమానా కూడా విధించింది. కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు డీకే అరుణకి ఇవ్వాలనీ న్యాయస్థానం ఆదేశించింది.
ఏళ్ళ తరబడి కేసులు సా..గితే.!
కోర్టులు.. కేసులు.. తీర్పులు.! న్యాయం ఆలస్యంగానైనా గెలిచిందని సంబరపడాలా.? లేదంటే, టెర్మ్ ముగుస్తున్న తరుణంలో.. తీర్పు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేయాలో తెలియని పరిస్థితి.
ఈ తరహా కేసుల్లో తీర్పు ఎంత వేగంగా వస్తే అంత ఉపయోగం.! ఆలస్యం అమృతం విషం.! రెండు మూడు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయ్.
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
మరి, ఈ రెండు మూడు నెలలు ఎమ్మెల్యేగా డీకే అరుణకి అవకాశం దక్కడంలో ఉపయోగమేముంది.?
అన్నట్టు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఓడిపోయిన డీకే అరుణ, ప్రస్తుతం బీజేపీలో వున్నారాయె.! మరి, ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారా.? బీజేపీ ఎమ్మెల్యే అవుతారా.?