Pawan Kalyan Cinematic Politics.. సినిమానా.? రాజకీయమా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సందర్భమిది.!
అటు సినిమా, ఇటు రాజకీయం.. ఈ రెండు పడవల ప్రయాణం.. ఇకపై కుదరకపోవచ్చు.! ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఓ పార్టీలో నాయకుడు మాత్రమే కాదు, ఆ పార్టీకి అధినేత కూడా.!
2024 ఎన్నికలకు ఎంతో దూరం లేదు. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.? జమిలి కాకుండానే, ముందస్తు ఎన్నికలు వస్తే.? జనసేనాని వ్యూహమెలా వుండబోతోంది.?
Pawan Kalyan Cinematic Politics.. చంద్రబాబు అరెస్టుతో..
టీడీపీ అధినేత చంద్రబాబు Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) అరెస్టుతో, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయం అనూహ్యంగా మారబోతోంది.!
కొందరు అంచనా వేస్తున్నట్లు చంద్రబాబు (Nara Chandrababu Naidu) మీద సింపతీ వస్తుందా.? ఏమో, ఆ సంగతి తర్వాత.!
ముందైతే, ఈ పరిణామం ఎంతవరకు రాజకీయంగా తనకు లాభం చేకూర్చుతుందన్నది జనసేన అధినేత ఆత్మపరిశీలన చేసుకోవాలి.!
మిత్రపక్షంగా టీడీపీని జనసేన అధినేత (Jana Sena Party Chief Pawan Kalyan) చూడొచ్చుగాక.! అది రాజకీయ వ్యూహం.! కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని ఆయన సమర్థవంతంగా అంచనా వేసుకోగలగాలి.!
ముఖ్యమంత్రి అవడానికి ఇదే ఛాన్స్.!
రాజకీయాల్లో ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతాయ్.! ఇప్పుడలాగే మారిపోతున్నాయ్.! నారా లోకేష్, టీడీపీని నడపగలరా.? అన్న అయోమయంలో వుంది టీడీపీ క్యాడర్.
ఏ పార్టీలో అయినా, ఇలాంటి కుదుపు సహజం.! తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కుదుపు లేదని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
బెయిల్ తీసుకుని, చంద్రబాబు (Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) బయటకు వచ్చినా.. ఏదో కేసులో ఆయన్ని మళ్ళీ జైలుకు పంపే ప్రయత్నాలైతే అధికార వైసీపీ నుంచి జరుగుతాయ్.
Also Read: 360 డిగ్రీస్ తెగులు.! ఈ ‘పచ్చ’ జాడ్యానికి చికిత్స లేదు.!?
ఈ తరుణంలో, సినిమాల్ని వున్నపళంగా పక్కన పడేసి, పూర్తిగా రాజకీయాలపై జనసేనాని ఫోకస్ పెట్టాల్సి వుంటుంది. కానీ, అది సాధ్యమేనా.?
కమిట్ అయిన సినిమాలేమో.. నిర్మాతలకు గుదిబండలుగా మారకూడదు.! మరి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు.? ఏదో ఒక నిర్ణయం.. వీలైనంత త్వరగా తీసుకోవాల్సిందే.!