Vaani Kapoor Showyagam.. బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఓ తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా.? అది కూడా నేచరుల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలో.!
ఆ సినిమా పేరు ఆహా కళ్యాణం.! దాదాపు పదేళ్ళ క్రితం వచ్చింది ఈ సినిమా. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. హిందీలో కూడా.!
స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఎవరికీ అనిపించలేదు. తమిళ డబ్బింగ్ అని కూడా అనుకోలేదు ఆడియన్స్.!
డిజాస్టర్ సినిమాగా నాని కెరీర్లో మిగిలిపోయింది ‘ఆహా కళ్యాణం’.!
అసలు విషయంలోకి వస్తే, వాణి కపూర్ మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోందిట.! రీ-ఎంట్రీ లాంటిదే.! ఏ సినిమాలో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలాంటి బౌండరీస్ ఏమీ లేవిప్పుడు.! అంతా ఇండియన్ సినిమానే.!
తాజాగా, వాణీ కపూర్ ఓ ఫొటోసెషన్‌లో పాల్గొంది. ఆ ఫొటోల్నే మీరిక్కడ చూస్తున్నది. పదేళ్ళ క్రితం వాణీ కపూర్ ఎలా వుందో.. ఇప్పుడూ అంతే.!
పిసరంత కండ కూడా అదనంగా ఆమెలో పెరిగింది లేదు. ఎలా మెయిన్‌టెయిన్ చేస్తోందబ్బా అంత పెర్ఫెక్ట్గా ఆ ఫిజిక్‌ని.? అన్న కామెంట్స్ పడుతున్నాయ్.
ఫిట్ అండ్ పెర్ఫెక్ట్.! అలా వుండేందుకోసం సిమ్మింగ్, డాన్స్, యోగా.. ఇవన్నీ చేస్తుందట వాణీ కపూర్.! చెయ్యాలి మరి.. ఇలా కనిపించాలంటే, అలా చేయక తప్పదు.!