Pushpa2 The Rule 2024.. ఔను.! ‘పుష్ప’ రాజ్ మళ్ళీ వస్తున్నాడు.! కానీ, ఈసారి ఇంకాస్త కొత్తగా.! మరింత పవర్‌ఫుల్‌గా.! పాన్ ఇండియా క్రేజ్ చూశాం ‘పుష్ప’రాజ్‌కి.‘
మరి, సరికొత్త ‘పుష్ప’రాజ్ వ్యవహారం ఎలా వుండబోతోంది.? అది తెలియాలంటే, 2024 ఆగస్ట్ 15 వరకూ వేచి చూడక తప్పదు.!
అదేంటీ.! ఈ ఏడాది ‘పుష్ప-2’ విడుదలయ్యే అవకాశం లేదా.? లేదు.. ఆ ఛాన్సే లేదు.! ఈసారి స్కేల్ చాలా చాలా పెద్దది మరి.!
అందుకే, టైమ్ కాస్త దూరంగా లాక్ చేసింది ‘పుష్ప 2 రూల్’ టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Pushpa2 The Rule 2024.. పుష్పగాడి రూలు.!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా ‘పుష్ప ది రైజ్’ వచ్చింది. దానికి కొనసాగింపు ఈ ‘పుష్ప 2 రూల్’.!
‘పుష్ప ది రైజ్’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఇంకెవరికీ సాధ్యం కాని అరుదైన అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే.

ఈసారి నేరుగా ఆస్కార్ బరిలోకి దిగబోతున్నాడు అల్లు అర్జున్.. అంటూ, ‘పుష్ప 2 రూల్’ గురించి, అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. తొలుత ‘పుష్ప’ని ఒకే పార్టులో తీయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల, రెండు పార్టులుగా డిసైడ్ చేశారు.
అలా డిసైడ్ చేసి.. డిజైన్ చేశారు.!
అలా డిసైడ్ చేసి, సరికొత్తగా డిజైన్ చేయడమూ కలిసొచ్చింది. మిక్స్‌డ్ టాక్.. కాదు కాదు, నెగెటివ్ టాక్‌తోనే ‘పుష్ప ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది.
Also Read: మెగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్.? నిజమేనంటారా.?
ఇప్పుడైతే కంప్లీట్ పాజిటివ్ బజ్.! ప్రీ రిలీజ్ అంచనాలు ఆకాశాన్నంటేస్తాయ్.! నీయవ్వ.. తగ్గేదే లే.!
లుక్ చూస్తున్నారు కదా.! రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో రివీల్ చేసిన ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఫొటో కనిపించట్లేదుగానీ.. చేతికి వున్న ఉంగరాలు.. ఆ మాస్ లెక్క వేరే.!