Prabhas Salaar Postponement అరరె.! ప్రభాస్ సినిమా ‘సలార్’ విడుదల వాయిదా పడిందే.! ఓసోస్.. మాకెపప్పుడో తెలుసంటారా.! అదంతే, ఇప్పుడన్నీ అలా ముందే తెలిసిపోతున్నాయ్.
ఇంతకీ, ‘సలార్’ (Prabhas Salaar) సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందట.! అది మాత్రం ప్రస్తుతానికి తెల్వద్.!
‘సలార్ కమింగ్ సూన్’ అంటూ, సినిమా విడుదల వాయిదాపై, నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 28న ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతోంది.
Prabhas Salaar Postponement.. క్వాలిటీ ముఖ్యం బిగిలూ.!
మెరుగైన క్వాలిటీతో సినిమాని విడుదల చేయాలనే కోణంలో, ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నది చిత్ర నిర్మాణ సంస్థ చెబుతున్న వాదన.
సాంకేతిక పరమైన అంశాల వల్లనే సినిమా విడుదల వాయిదా పడక తప్పలేదని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
అంటే, గ్రాఫిక్స్ సహా.. కీలకమైన అంశాలన్నమాట.! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న సినిమా ఇది.
ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది ‘సలార్’ సినిమాలో.
ఎప్పుడొస్తావ్ సలారూ.!
మరోపక్క, ‘ఆదిపురుష్’తో నిరాశపర్చిన ప్రభాస్ నుంచి, భారీ హిట్ ఆశిస్తున్నారు అభిమానులు. వారి కోరిక ‘సలార్’తో తీరుతుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
కాగా, ‘సలార్’ విడుదల నవంబర్‌లో జరుగుతుందా.? డిసెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందా.? సంక్రాంతికి వెళుతుందా.? అన్నదానిపై స్పష్టత లేదు.
Also Read: మెగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్.? నిజమేనంటారా.?
ఎప్పటికి వాయిదా పడిందో చెప్పకపోతే, చాలా సినిమాలు.. ‘సలార్’ వల్ల ముందూ వెనకా అయ్యే పరిస్థితి వుంది. ఈ గందరగోళం చాలా సినిమాల్ని దెబ్బతీస్తుంది కూడా.!