Khushi Kapoor South Cinema.. జాన్వీ కపూర్ సౌత్ సినిమాతోనే తెరంగేట్రం చేయాల్సి వున్నా, బాలీవుడ్ వైపే మొగ్గ చూపారు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.!
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె, జాన్వీ కపూర్ తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేస్తుందని అప్పట్లో.. అంటే, శ్రీదేవి (Sridevi) జీవించి వున్నప్పుడు.. ప్రముఖంగా ప్రచారం జరిగేది.
కారణం ఏదైతేనేం, పెద్ద కుమార్తెను బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేయించిన బోనీ కపూర్ (Boney Kapoor), చిన్న కూతుర్ని మాత్రం సౌత్ సినిమాతో తెరంగేట్రం చేయించాలని అనుకుంటున్నాడట.
Khushi Kapoor South Cinema.. హీరో ఎవరు.?
అధర్వ హీరోగా తెరకెక్కనున్న ఓ తమిళ సినిమాతో ఖుషీ కపూర్ (Khushi Kapoor) తెరంగేట్రం చేస్తుందన్న ప్రచారమైతే తెరపైకొచ్చింది.

మన తెలుగు ప్రేక్షకులకీ అధర్వ సుపరిచితుడే. వరుణ్ తేజ్ (Varun Tej Konidela) హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో అధర్వ నటించిన సంగతి తెలిసిందే.
ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడట. అతను గతంలో విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పని చేశాడట.
టాలీవుడ్ పిలుస్తోందిగానీ..
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల కొరత వుంది. ఖుషీ కపూర్ (Kushi Kapoor) ‘సరే’ అనాలిగానీ, టాలీవుడ్ నుంచి ఆమెకి ఆఫర్లు పోటెత్తుతాయ్.

కానీ, ఖుషీ కపూర్ (Khushi Kapoor) అటు బాలీవుడ్ కాకుండా, ఇటు టాలీవుడ్ (Telugu Cinema) కాకుండా.. కోలీవుడ్‌ని ఎందుకు ఎంచుకున్నట్టు చెప్మా.?
Also Read: మీనాక్షి చౌదరికి ప్రమోషన్ అట కదా.!
ఇంతకీ, ఈ ప్రచారంలో నిజమెంత.? అది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
అన్నట్టు, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) సరసన ‘దేవర’ (Devara Movie) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.!
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా తెరకెక్కుతోంది.