Covid JN1 Variant కోవిడ్ పాండమిక్ ఇంకా ముగిసిపోలేదు. ముగిసిపోయిందని మనం అనుకుంటున్నామంతే.! కోవిడ్ అనేది ఎప్పటికీ అలాగే వుండిపోతుందా.?
తాజాగా, కొత్త వేరియంట్ రంగంలోకి దిగింది. మన దేశంలో, కేరళ రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కేసుల పెరుగుదల షురూ అయ్యింది. మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయట.
రాష్ట్రాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ‘భయపడాల్సిన పనేమీ లేదు..’ అంటూనే, టెస్టుల సంఖ్య పెంచాలనీ, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలనీ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Covid JN1 Variant.. జెఎన్ వన్ వేరియంట్.!
కొత్త వేరియంట్‌కి ‘జెఎన్ వన్ వేరియంట్’ అని నామకరణం చేశారు. సాధారణ జలుబు కూడా వైరస్ వల్లనే వస్తుందని చాలామందికి తెలుసు కదా.?
కానీ, కోవిడ్ వైరస్‌ని అలా చూడలేం. అంత తేలిగ్గా కోవిడ్ గురించి మాట్లాడలేం. ఎందుకంటే, కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాల్ని తీసేసింది.
ప్రపంచాన్ని కొన్ని రోజులపాటు ‘వున్న చోటనే ఆపేయగలిగింది’ కోవిడ్ వైరస్.! ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత భయంకరమైన రక్కసి కోవిడ్.
భయం లేకుండా ఎలా.?
మాస్కులు పెట్టుకుని తిరగండి.. కోవిడ్ (Covid – Corona Virus) అనుమానం వుంటే, ఆసుపత్రికి వెళ్ళండి.. అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయ్.
మాస్కుల ఖర్చు.. ఆసుపత్రుల ఖర్చు.. నిజానికి, ఇది ఖర్చు కాదు దోపిడీ.! మూడు డోసుల వ్యాక్సిన్ దాదాపుగా దేశ ప్రజలంతా తీసేసుకున్నారు.
మళ్ళీ కొత్త వ్యాక్సిన్ వేసుకోవాలా.? కోవిడ్ సోకితే, ఆక్సిజన్ సిలెండర్లు అవసరమవుతాయా.? ఖరీదైన మందులు వాడాలా.? ఇలాంటి చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయ్.
ఇమ్యూనిటీ పెంచే మందులు మింగేయడం మొదలైంది. చిన్నపాటి జలుబుకే కంగారు పడే పరిస్థితి మళ్ళీ వచ్చేసింది.
మీ ప్రాణం.. మీరే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. ‘భయపడాల్సిన పనిలేదు’ అని ప్రభుత్వాలు చెబుతాయ్.! ఇంట్లోంచి బయటకు రావొద్దంటూ, ‘లాక్ డౌన్లు’ పెట్టేస్తాయ్.!
జర జాగ్రత్త.! ఏమైనా జరగొచ్చు. ఏదీ జరగకూడదని కోరుకుందాం. వ్యక్తిగతంగా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడం మంచిది.