Kavya Thapar Eagle.. ‘ఏక్ మినీ ప్రేమ కథ’ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అందాల భామ కావ్య థాపర్.!
అందులోని చిలిపి కంటెంట్, దానికి తోడు కావ్య థాపర్ (Kavya Thapar) గ్లామర్.. వెరసి, ఈ బ్యూటీకి స్పెషల్ క్రేజ్ తెచ్చి పెట్టాయ్.!
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది కావ్య థాపర్. అన్నీ అనుకున్నట్టే జరిగి వుంటే, ఈ సంక్రాంతికి ‘ఈగిల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వుండేది.

రవితేజ సినిమా కావడంతో, ఈ సంక్రాంతికి హీరోయిన్‌గా కావ్య థాపర్ పేరు కూడా మార్మోగిపోయేదే మిగతా సినిమాల హీరోయిన్లతోపాటు.
Kavya Thapar Eagle.. చేతిలో రెండు సినిమాలున్నాయ్..
అన్నట్టు, ఫిబ్రవరి 9కి ‘ఈగిల్’ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘ఈగిల్’తోపాటు మరో సినిమాలోనూ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆ సినిమా పేరు ‘ఊరి పేరు భైరవ కోన’. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరో. ఇవే కాక, మరికొన్ని ప్రాజెక్టులనుంచీ కావ్య థాపర్‌కి అవకాశాలు వచ్చిపడుతున్నాయట.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ కావ్య థాపర్ (Kavya Thapar)కి బోల్డన్ని ఆఫర్లు వస్తున్నాయట.
ఒక్కటి.. ఒకే ఒక్కటి సరైన కమర్షియల్ హిట్ దొరికితే, హీరోయిన్ల లీగ్‌లో దూసుకుపోయే సత్తా కావ్య థాపర్ (Kavya Thapar)కి వుంది మరి.!
ప్రస్తుతానికైతే ఓ మోస్తరు ప్రమోషన్ హీరోయిన్‌గా తనకు దక్కినట్లేనని కావ్య థాపర్ అంటోంది ‘ఈగిల్’ సినిమా రూపంలో.!