Malavika Mohanan Gangster.. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి.. వస్తూనే వుంటాయి. ఆ కథాంశానికి వున్న క్రేజ్ అలాంటిది మరి.!
రెట్రో ఫీల్‌తో తెరకెక్కే సినిమాలు.. నయా ట్రెండ్ గ్యాంగ్‌స్టర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే సినిమాలు.. వాట్ నాట్.. దర్శకులకి గ్యాంగ్‌స్టర్ కథాంశమంటే, ఓ రేంజ్ కిక్ వుంటుంది మరి.
కథానాయకులు కూడా, గ్యాంగ్‌స్టర్‌గా తాము తెరపై కనిపించాలని కోరుకుంటుంటారు.. అలా దర్శక నిర్మాతల్ని ఒప్పిస్తుంటారు కూడా.!
Malavika Mohanan Gangster.. హీరోయిన్ల సంగతేంటి.?
నిజానికి, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కినా, వాటిల్లో అందాల బామలు కీలక పాత్రల్లో పోషించినా, కథానాయికే గ్యాంగ్‌స్టర్.. అనిపించుకున్న సందర్భాలు చాలా అరుదు.
కానీ, హీరోయిన్లకీ గ్యాంగ్‌స్టర్ అనిపించుకోవాలని వుంటుంది.. తెరపై తమను తాము గ్యాంగ్‌స్టర్ రోల్స్‌లో చూసుకోవాలనే ఆశ కూడా వుంటుంది మరి.!

ఆ లిస్టులో మాళవిక మోహనన్ పేరు కూడా చేర్చేయొచ్చు. అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్షన్ సందర్భంగా, మాళవిక, తన మనసులోని ‘గ్యాంగ్‌స్టర్’ కోరికని బయటపెట్టింది.
గ్లామరస్ గ్యాంగ్‌స్టర్..
మాళవిక మోహనన్ అంటే.. అందానికి అందం.. నటనకు నటన.! బ్యాక్ టు బ్యాక్ పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తోంది మాళవిక మోహనన్ వివిధ భాషల్లో.
అందులో, ‘రాజాసాబ్’ కూడా ఒకటి. మోహన్‌లాల్‌తో ఓ సినిమా చేస్తోంది. ఇవన్నీ ప్యాన్ ఇండియా మూవీస్.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
ఇంతకీ, మాళవిక మోహనన్‌ని కూల్ అండ్ లవ్లీ గ్యాంగ్‌స్టర్‌గా వెండితెరపై ఎవరు చూపిస్తారు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!
