Kangana Ranaut Politics BJP.. గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా వాయిస్ పెంచిన సినీ నటి కంగనా రనౌత్, బీజేపీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది.
కంగనా రనౌత్ (Bollywood Actress Kangana Ranaut), అరుణాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనుంది.
ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం, కంగనా రనౌత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ తాజా లిస్టులో తన పేరు చూసుకున్న కంగనా రనౌత్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది.
Kangana Ranaut Politics BJP.. గెలిచే సీటు..
అరుణాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం, బీజేపీకి కొంత అనుకూలంగా మారింది. కంగనా రనౌత్ ఫ్యాక్టర్ ఇక్కడ బాగా పని చేయనుంది.

గత కొంతకాలంగా, కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఈ నియోజకవర్గంలో వర్క్ షురూ చేసింది. స్థానికంగా తన టీమ్‌తో పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది.
అయితే, కంగనా రనౌత్‌కి టిక్కెట్ ఇచ్చే విషయమై ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చిందట బీజేపీ అధినాయకత్వానికి.
కేవలం సినీ గ్లామరే కాదు..
కంగనా రనౌత్ సినిమా గ్లామర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారినా, కంగనా రనౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ అయితే దక్కించుకుంది.
సినీ నటులు.. అందునా, నటీమణులు రాజకీయాల్లో కొత్త కాదు. అయితే, కంగనా రనౌత్ రాజకీయం మాత్రం సమ్‌థింగ్ స్పెషల్.
Also Read: అరవింద్ కేజ్రీవాల్.. అలా ఎదిగి, ఇలా పతనమై.!?
బీజేపీకి మద్దతుగా నిలిచినందుకుగాను, రాజకీయంగా కంగనా రనౌత్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ముంబైలో కంగన కార్యాలయంపై దాడులు కూడా జరిగాయ్.

అన్నిటినీ తట్టుకుని నిలబడింది కంగన. ఆమెకు బీజేపీ అండగా వుంటూ వచ్చింది. లోక్ సభలో కంగనా రనౌత్ వాయిస్ వినిపిస్తే.. ఆ కిక్కే వేరప్పా.!
రాజకీయాల్లో లేకపోయినా, పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం ద్వారా ‘లేడీ డైనమైట్’ అనిపించుకున్న కంగనా రనౌత్, రాజకీయ రంగ ప్రవేశం చేసి, లోక్ సభ అభ్యర్థిగా గెలిస్తే.. పొలిటికల్ జేజెమ్మ అయిపోతుందేమో.!