Natural Star Nani Tier Hero.. ‘ఈ సినిమా విజయంతో మీరు టైర్ వన్ హీరో అయిపోయినట్లేనా.?’ అన్నది సోకాల్డ్ ఎర్నలిస్టుల నుంచి వచ్చిన ఓ ప్రశ్న.
నాని హీరోగా తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఇటీవల విడుదలై, మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది.
ఈ క్రమంలో కొందరు ఎర్నలిస్టులు, మైకుల్ని కొరికేయడానికి తమ ప్రతిభనంతా ఉపయోగించారు. అలా ఓ ఎర్నలిస్టు సంధించిన ప్రశ్నే పైన పేర్కొన్నది.
Natural Star Nani Tier Hero.. నాని ఏమన్నాడంటే..
‘ఈ టైర్ల గోల నాకెందుకు.? అసలు టైర్ల గురించి ఎవరు చెప్పారు.? నన్ను ఇందులోకి లాగకండి..’ అని నాని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
టైర్ వన్ హీరో, టైర్ టూ హీరో.. ఇలాంటి డివిజన్ అసలు సినీ పరిశ్రమలోకి ఎవరు తీసుకొచ్చారు.? అంటే, ప్చ్.. సమాధానం దొరకదు.
సోషల్ మీడియాలో ఎవరో ఏదో సొల్లు వాగుతారు.. దాన్ని పట్టుకుని మీడియా ముసుగులో కొందరు ఎర్నలిస్టులు, దానర్థం తెలియకుండానే, ఆ సొల్లు మీద సినీ జనాల్ని ప్రశ్నించేస్తుంటారు.
ప్రతి శుక్రవారం స్టార్డమ్ మారిపోతున్న రోజులివి. హిట్టు పడితే, ఆ హీరో రేంజ్ మారిపోతుంది. ఫ్లాప్ తగిలితే.. ఇక అంతే.!
Also Read: అరరె.. అమీ జాక్సన్ పెళ్ళంట.!
ఇది మీడియాకి తెలియదా.? తెలిసినా, సోకాల్డ్ ఎర్నలిస్టులతోనే అసలు తంటా.! నాని, జాగ్రత్తగా సమాధానం చెప్పాడు కాబట్టి సరిపోయింది.
ఒకవేళ హిట్టు తలకెక్కి, నాని ఏదన్నా తేడాగా మాట్లాడితే.. అంతే సంగతులు.! సింగిల్ సినిమా హీరోలు కొందరు విర్రవీగడం చూస్తున్నాం.
అన్నట్టు, ఇలా ప్రశ్నలడగడానికీ డబ్బులు తీసుకునే ఎర్నలిస్టులున్న రోజులివి.! మీడియా కాదిది, నిజానికి.. ఇదంతా ఓ మాఫియా… అనే వాదనా లేకపోలేదు.!
ఇదిలా వుంటే, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎస్ జే సూర్య, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది.