Home » చిన్న హీరోయిన్.! పెద్ద సాయం చేసెన్.!

చిన్న హీరోయిన్.! పెద్ద సాయం చేసెన్.!

by hellomudra
0 comments
Ananya Nagalla

Ananya Nagalla Flood Relief.. ఆమె చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది, నటిస్తోంది.! పెద్ద సినిమాల్లో అయితే, సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తోంది.!

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమె కూడా ఓ కీలక పాత్రరలో కనిపించింది.

ఇప్పుడా బ్యూటీ, తెలుగు రాష్ట్రాలకు ఏకంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అదీ, వరద ముంపు బాధితుల సహాయార్థం.!

ఆమె ఎవరో కాదు, సినీ అనన్య నాగళ్ళ. తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తనవంతు సాయంగా, ఐదు లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించింది.

Ananya Nagalla Flood Relief.. ఎంత పెద్ద మనసో కదా.!

ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. అంటారు పెద్దలు.!

సినీ పరిశ్రమ ద్వారా తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఏదో ఒకరకంగా సాయం చేయాలనుకుంటుంటారు సినీ ప్రముఖులు.

మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ మహేష్‌బాబు.. ఇలా ప్రముఖ హీరోలు కోట్లల్లో సాయం ప్రకటించడం చూస్తున్నాం.

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి నటులూ తమకు తోచిన మేర సాయం ప్రకటిస్తున్నారు. పెద్ద హీరోయిన్లూ ఇలాంటి సందర్భాల్లో విరాళాలు ప్రకటిస్తుంటారు.

కానీ, చిన్న చిన్న సినిమాల్లో నటించే నటీమణుల నుంచి విరాళాలు చాలా అరుదైన విషయమే. నిజానికి, వాళ్ళూ సాయం చేస్తుంటారు.. కాకపోతే, ఆ విషయాలు బయటకు పొక్కవు.

పెద్ద మనసు.. పెద్ద సాయం..

అనన్య నాగళ్ళ (Ananya Nagalla) చేసిన సాయం నిజానికి చాలా చాలా పెద్దదే.! ఔను, నిజమే.. ఆమె స్థాయికి అది పెద్ద విరాళమే.

మరోపక్క యాంకర్ స్రవంతి చోకారపు (Sravanthi Chokarapu) కూడా విరాళాన్ని ప్రకటించింది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా స్రవంతి పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

Sravanthi Chokarapu
Sravanthi Chokarapu

ఓ హీరో విరాళమిచ్చారు.. ఇంకో హీరో స్పందించలేదు.. అంటూ, ట్రోలింగ్ కూడా ఇక్కడ అనవసరం. అసందర్భం.! సాయం చేయమని మన సినీ ప్రముఖులకు ఎవరూ చెపక్కర్లేదు.

Also Read: Ruhani Sharma’s Strong Statement About AGRA

పొరుగు రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినా, మన సినీ ప్రముఖులు పెద్ద మనసుతో స్పందిస్తుంటారు. అలాంటిది, తెలుగు రాష్ట్రాల్లోని విపత్తులకు ఎందుకు స్పందించరు.?

ఖచ్చితంగా స్పందిస్తారు.. కాకపోతే, ఎవరికి తోచినంత వాళ్ళు.. ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు.. సాయం చేస్తారు, స్పందిస్తూనే వుంటారు.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group