Table of Contents
Bigg Boss Soniya Nikhil.. ఓ హీరో కోసం, ఇద్దరు హీరోయిన్లు ఎగబడటం.. ఈ క్రమంలో జుట్లు పట్టుకోవడం.. తెలుగు తెరపై ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ కాన్సెప్ట్ ఇది.!
తెలుగు సినిమాల్లోనే కాదు, బాలీవుడ్ సినిమాల్లో అయినా.. ఏ సినీ రంగంలో అయినా, సూపర్బ్‌గా వర్కవుట్ అయిన, అవుతూనే వున్న కాన్స్పెప్ట్.!
అంత మాత్రాన, ఆ ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవలుంటాయా.? జస్ట్ సినిమా కోసం అలా యాక్ట్ చేస్తుంటారంతే.
హీరో – విలన్ మధ్య గొడవలు కూడా సినిమా వరకే.! బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే, ఫేక్ ఎమోషన్స్‌ని రియలిస్టిక్‌గా చూపించడమే బిగ్ బాస్ హౌస్ ప్రత్యేకత.
Bigg Boss Soniya Nikhil.. ఎందుకొచ్చావ్ సోనియా.?
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదవ సీజన్‌లో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ సోనియా ఆకుల, తాజాగా రీ-ఎంట్రీ ఇచ్చింది.
అది కూడా, ఈ వారం ఎలిమినేట్ అవబోయే కంటెస్టెంట్‌కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు. ఇదేదో కొత్త కాన్సెప్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు అనుకుని వుండొచ్చు.. కానీ, ఇదో చెత్త కాన్సెప్ట్.

వచ్చింది, గట్టిగా అరిచింది… ‘బై’ చెప్పేసి తిరిగెళ్ళిపోయింది బయటకి.! ప్రేరణ, నిఖిల్.. ఈ ఇద్దరూ, సోనియా వల్ల నామినేట్ అయ్యారు.
ప్రేరణపై అదే కసి.!
ప్రేరణ మీద కసి తీర్చుకుంది సోనియా. నిఖిల్ విషయంలో ఏదో చెప్పాలనుకుని, ఇంకోటేదో చెప్పి, యష్మి – నిఖిల్ మధ్య సోనియా గొడవ పెట్టేసింది.
అటు ప్రేరణ, ఇటు నిఖిల్.. గట్టిగానే ఇచ్చేశారు సోనియాకి. మరోపక్క, సోనియా మాట్లాడిన మాటల్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని, చెలరేగిపోయింది యష్మి.
పెద్ద కొడుకు, తమ్ముడు.. అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పి, ‘ఫేక్’ అని నిఖిల్ మీద సోనియా వేసిన ముద్ర, ముమ్మాటికీ, అతని ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది.
యష్మికి సోనియా రాక వల్ల కొంత అడ్వాంటేజ్. ఎమోషనల్‌గా యష్మి, యాక్టింగ్ చేయడానికి, సోనియా డైలాగులు ఉపయోగపడతాయ్.
వెర్రి వెంగళప్ప..
కానీ, సోనియా వెర్రి వెంగళప్ప అయిపోయింది.. ఇలా రీ-ఎంట్రీ ఇవ్వడం ద్వారా.! ఎంత డబ్బు ఇస్తే మాత్రం, ఇలానా చేసేది.?
వాస్తవానికి, ఈ సీజన్ విన్నర్ అయ్యే అర్హతలు సోనియాకి వున్నాయ్. కానీ, ఆట తక్కువ.. సోది ఎక్కువ.. అన్నట్లుగా ఆమె పాత్రని ఎటు కావాలంటే అటు మార్చేశాడు బిగ్ బాస్.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
ఎలాగైతేనేం, ఎలిమినేట్ అయిపోయింది.. హమ్మయ్య.. అనుకున్నారు ఆమెని అభిమానించే కొందరు. కానీ, తిరిగొచ్చి.. చీవాట్లు తింటోంది.. అదీ, ఒక్క ఎపిసోడ్‌లో కొన్ని నిమిషాలే వున్నందుకు.