Bhagyashri Borse Bachhan.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. వస్తూ వస్తూనే ఈ ముద్దుగుమ్మ బోలెడంత క్రేజ్ సంపాదించేసింది.
అయితే, సినిమా హిట్ అయ్యుంటే ఆ క్రేజ్ నెక్స్‌ట్ లెవల్ వుండేది. ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడికి బోనీ ఏమంత కలిసి రాలేదు.
కానీ, భాగ్యశ్రీ బోర్సేని తెలుగు జనం అంత త్వరగా మర్చిపోలేదనుకోండి అది విేరే సంగతి. అంతలా తన అంద చందాలతో హావ భావాలతో ఆకట్టుకుంది డెబ్యూ మూవీలో భాగ్యశ్రీ.
Bhagyashri Borse Bachhan.. అసలు భాగ్యం అది కదా.!
జనం కాదు, మేకర్లు గుర్తుంచుకుంటేనే కదా.. ముద్దుగుమ్మలకు అసలు సిసలు ‘భాగ్యం’. మరి మన భాగ్యశ్రీ (Bhagyashri Borse) భాగ్యం గురించి మాట్లాడుకోవాలంటే..
ప్రస్తుతం ఓ బంపర్ ఛాన్స్ తగిలిందని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం భాగ్యశ్రీ పేరు పరిశీలిస్తున్నారట.

‘కంగువా’ సినిమా తర్వాత సూర్య ఖాతాలో చాలానే సినిమాలున్నాయ్. అందులో ఒకటి తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కూడా వుంది.
భాగ్యశ్రీకి లక్కు చిక్కినట్లే.!
‘లక్కీ భాస్కర్’ సినిమాతో హిట్టు కొట్టి ఫుల్ ఖుషీలో వున్న వెంకీ అట్లూరి, సూర్యతో ఓ ప్యాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడట.
చిత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలున్నాయ్. ఈ సినిమాలోనే భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైందనీ తెలుస్తోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, భాగ్యశ్రీ లక్కు నక్క తోక తీొక్కినట్లే. డైరెక్టర్‌గా అట్లూరికి మంచి ట్రాక్ రికార్డ్ వుంది.
సో, భాగ్యశ్రీకి ఈ ఛాన్స్ ఇటు టాలీవుడ్‌లోనూ అటు కోలీవుెడ్‌లోనూ బాగా కలిసొచ్చే అంశమే.! అటు హిందీ సినీ పరిశ్రమలోనూ భాగ్యశ్రీకి అవకాశాలు బాగానే వస్తున్నాయట.