Status Of Pawan And Jagan జన సేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరి మధ్యా ‘స్థాయి’ చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయ్.
మొన్నీమధ్యనే తనకు మాత్రమే సాధ్యమయ్యేలా ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, అందులో ఎవరో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, ‘ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’ అని పవన్ కళ్యాణ్ మీద సెటైరేశారు వైఎస్ జగన్.
దాంతో, ఇప్పుడు ‘స్థాయి’ గురించిన చర్చ షురూ అవడంలో వింతేముంది.? గత కొద్ది రోజులుగా ఈ విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
ఇంతకీ, ఎవరి ‘స్థాయి’ ఏంటి.? రాజకీయాల్లో గెలుపోటములు అంటే, ఎవరెక్కువ ప్రజల మన్ననల్ని పొందారు.. అనడానికి ఓ చిన్న గీటు రాయి అంతే.!
Status Of Pawan And Jagan.. ప్రజల మెప్పు పొందడమే..
ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఎవరైతే ‘మేం మీకు మంచి చేయగలం’ అని ప్రజల్ని నమ్మించగలుగుతారో, వారికి పదవులు వస్తాయ్.
అలా నమ్మించడంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు.. తమ తమ పార్టీల పరంగా.

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అదఃపాతాళానికి తొక్కేస్తాం..’ అని పవన్ కళ్యాణ్ శపథం చేసి, మాట నిలబెట్టుకున్నారు. ‘పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేటు తాకనివ్వం’ అని శపథం చేసి, వైసీపీ చేతులెత్తేసింది.
ముందే చెప్పుకున్నట్లు, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఎవరూ, ఎవరి స్థాయి గురించీ వ్యక్తిగతంగా మాట్లాడుకోకూడదు.
పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా రకాల ‘వాగుడూ’ వాగారు. ఫలితం అనుభవిస్తున్నారు. ప్రజలు, ఆ పనికిమాలిన వాగుడుకి చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారు.
ఎవరెక్కువ.? ఎవరు తక్కువ.?
సో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట ‘కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’ అన్న మాట అని వుండకూడదు.! ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ స్థాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ది.
పవన్ కళ్యాణ్ అంటే, పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా.! మరి, జగన్ మోహన్ రెడ్డి సంగతేంటి.? ఆయన జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే.
పైగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్ళడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారు. దానర్థం, ఎమ్మెల్యే స్థాయి కంటే కూడా తక్కువే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
రాజకీయాల్లో మాట మీద ఎంత ఎక్కువ అదుపు వుంటే, అంత మంచిది. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అది లేదు.! అందుకే, ఇప్పుడు అదఃపాతాళాన్ని వైసీపీ చూస్తోంది.
ఇంకొకరి స్థాయి గురించి తక్కువ చేసే ముందు, తన స్థాయి ఏంటన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెక్ చేసుకుంటే మంచిది.!
చివరగా.. పులివెందుల నియోజకవర్గానికి కూడా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి.!
