Table of Contents
Divya Bharti Death Mystery.. నటి దివ్య భారతి మీకు తెలుసా.? చక్కని చిరు నవ్వు.. మంచి డాన్సర్, ఆపై మంచి నటి కూడా.!
తమిళ నటి దివ్య భారతి కాదు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అందాల తార దివ్య భారతి గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం.
తెలుగులో ‘రౌడీ అల్లుడు’, ‘బొబ్బిలి రాజా’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది దివ్య భారతి. ‘తొలి ముద్దు’ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో అనుమానాస్పద రీతిలో మరణించిందామె.
Divya Bharti Death Mystery.. ప్రేమ, పెళ్ళి.. మరణం..
ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ సాజిద్ నడియడ్‌వాలాతో ప్రేమలో పడి, అతన్ని పెళ్ళి చేసుకుని.. ఈ క్రమంలో మతం కూడా మార్చుకున్న దివ్య భారతి ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియదు.
ఐదో అంతస్తు నుంచి ఆమె కింద పడి చనిపోయింది. కానీ, ఆత్మ హత్య చేసుకుందా.? ప్రమాదవశాత్తూ చనిపోయిందా.? ఎవరైనా చంపేశారా.? అన్నదానిపై మిస్టరీ మాత్రం వీడలేదు.

అప్పట్లో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అయిన దివ్య భారతి, చేసింది తక్కువ సినిమాలే అయినా, విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.
‘దివ్య భారతిని చంపేశారు’ అంటారు కొందరు. ‘వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా ఆత్మ హత్య చేసుకుంది’ అంటారు ఇంకొందరు.
అలా ఎలా.?
ఇవేవీ కాదు, తప్ప తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయి చనిపోయిందని మరికొందరు అంటుంటారు.
నిజానికి, సినీ పరిశ్రమలో ఇలాంటి డెత్ మిస్టరీస్ చాలానే వుంటాయ్. కొన్ని అవకాశాల్లేక, కొన్ని ఆర్థిక ఇబ్బందులతో, ఇంకొన్ని.. నమ్మిన వ్యక్తి మోసం చేయడం వల్ల.!
నిజానికి, దివ్య భారతికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. కెరీర్ పరంగానూ అత్యున్నత స్థానంలోనే వుంది. సాజిద్ నడియడ్‌వాలాని పెళ్ళాడింది, మతం కూడా మార్చుకుంది.
సినిమాటిక్ మిస్టరీ..
మరి, ఎలా.. ఎందుకు.. దివ్య భారతి చనిపోయింది.? ఇదో సినిమాటిక్ మిస్టరీ.!
అన్నట్టు, ‘తొలి ముద్దు’ సినిమా, దివ్య భారతి హఠాన్మరణం కారణంగా ఆగిపోతే, దివ్య భారతి స్థానంలోకి వచ్చింది రంభ. అలా, నటి రంభ ‘జూనియర్ దివ్య భారతి’ అనే ట్యాగ్‌తో పాపులారిటీ పెంచుకుంది.
ఈ రోజు.. అంటే, దివ్య భారతి వర్ధంతి.! ఇదే రోజున, అనగా 1993, ఏప్రిల్ 5న ఆమె అనుమానాస్పద రీతిలో మృతి చెంది. జస్ట్ మూడేళ్ళ కెరీర్.. బోల్డన్ని సినిమాలు.. తిరుగులేని ఫాలోయింగ్.! ఇంతలోనే మరణం.!
చనిపోయేనాటికి దివ్య భారతి వయసు జస్ట్ 19 ఏళ్ళు మాత్రమే.!