Koolies Vs Sramikulu Pawakalyan.. ఉపాధి కూలీల గురించి వింటుంటాం. కేంద్ర ప్రభుత్వం ‘నరేగా’ పేరుతో ‘పని దినాల్ని’ కల్పిస్తుంటుంది. తద్వారా కూలీలకు ఉపాధి దొరుకుతుంది.
అసలు కూలీలు.. అని ఎలా అనగలం ఎవర్నయినా.? ఈ ఆలోచన ఇప్పటిదాకా ఎవరికైనా వచ్చిందా.? కూలీ ఇస్తున్నాం కాబట్టి, కూలీ.. అనేయడమే తెలుసు మనలో చాలామందికి.
కానీ, జన సేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకింత భిన్నంగా ఆలోచించారు. కాదు కాదు, మానవీయ కోణంలో ఆలోచన చేశారు.
‘‘ఇకపై, మనం ‘ఉపాధి కూలీలు’ అనొద్దు. ఆ స్థానంలో ‘శ్రామికులు’గా వారిని గుర్తిద్దాం..’ అంటూ జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Koolies Vs Sramikulu Pawakalyan.. కూలీ.. అంటే, అవమానమే.!
మీడియాలో వచ్చే వార్తల్లో కావొచ్చు, అధికారికంగా జరిగే సంభాషణల్లో కావొచ్చు, ఇకపై ‘కూలీ’ అనే ప్రస్తావన కాకుండా, శ్రామికులు.. అనే ప్రస్తావన చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేయడం గమనార్హం.
దాంతో, సహజంగానే అందరి మన్ననలూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అందుతున్నాయి. ‘కూలీ’ అనే మాటని వినీ వినీ విసిగిపోయినవారంతా, ‘శ్రామికులు’ అనే గుర్తింపు దక్కుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో పంచాయితీ రాజ్ శాఖ కూడా ఒకటి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంతకు ముందెన్నడూ జరగని అద్భుతాలు, పవన్ కళ్యాణ్ హయాంలో జరుగుతున్నాయి ఈ విభాగంలో.
మార్పు తెచ్చిన పవన్ కళ్యాణ్
దశాబ్దాలుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు, ఇప్పుడిప్పుడే రోడ్లను చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కారణంగా.
Also Read: తప్పు మేడమ్.! మీరలా ప్రశ్నించకూడదు.!
పంచాయితీలకు నిధులు, పంచాయితీల్లో అభివృద్ధి.. వెరసి, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ వేస్తున్నారు.
అనుభవం లేదంటూనే, అత్యంత బాధ్యతాయుతమైన ‘పని’ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.