Pawan Kalyan OG Shoot.. ఎప్పుడో పూర్తయిపోవాల్సిన సినిమా అది.! కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో, అర్థాంతరంగా ఆగిపోయింది.
‘హరి హర వీర మల్లు’ సినిమా గురించి అనుకుంటున్నారా.? అది, ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమవుతోంది కూడా.!
‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించేమోనని అనుకుంటున్నారా.? అదీ, కాదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పునఃప్రారంభమవడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.
Pawan Kalyan OG Shoot.. హంగ్రీ చీటా.. వచ్చేస్తున్నాడు.!
ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్.. హంగ్రీ చీటా వచ్చేస్తున్నాడు.! ఔను, ‘OG’ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. పవన్ కళ్యాణ్ త్వరలోనే, షూటింగ్‌లో పాల్గొననున్నారు.
ఈ విషయాన్ని తాజాగా, నిర్మాణ సంస్థ ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ వెల్లడించింది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు ‘ఓజీ’ చిత్రాన్ని.

ప్రియాంక మోహన్ ఈ ‘ఓజీ’లో హీరోయిన్ కాగా, శ్రియా రెడ్డి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. పవన్ కళ్యాణ్ కాకుండా, మిగతా నటీనటులు మాత్రమే కనిపించే సీన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయిపోయిందట.
పవన్ కళ్యాణ్ జాయిన్ అయితే, సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసెయ్యాలని ఇటు దర్శకుడు, అటు నిర్మాత అనుకుంటున్నారు.
‘మళ్ళీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’ అంటూ, ‘ఓజీ’ షూటింగ్ పునఃప్రారంభంపై నిర్మాణ సంస్థ ట్వీటేయడం గమనార్హం.
‘ఓజీ’ పూర్తయితే, హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్..
‘ఓజీ’ షూటింగ్ పూర్తయిపోతే, ఆ వెంటనే పవన్ కళ్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఫోకస్ పెడతారు. కాస్త గ్యాప్ గట్టిగానే వచ్చిన దరిమిలా, హరీష్ శంకర్ కథలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Good Bad Ugly Review: డిజాస్టర్ ‘సుడిగాడు’.!
తమిళ సినిమా ‘తెరి’కి ఇది రీమేక్. అయితే, రీమేక్‌లా కాకుండా, హరీష్ శంకర్ మార్క్ ట్రీట్మెంట్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కాబోతోందని అంటున్నారు.
కాగా, తొలుత ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ కథ నిజానికి వేరే. మళ్ళీ ఇప్పుడు ఆ కథనీ, అదే టైటిల్‌నీ హరీష్ శంకర్ తీసుకొస్తారని అనుకోవచ్చా.?