Table of Contents
Pawan Kalyan Hindi Trolling.. ‘హిందీ’ చుట్టూ పెద్ద యుద్ధమే నడుస్తోంది సోషల్ మీడియా వేదికగా. ఇంత యాగీ ఎందుకు జరుగుతోందో తెలుసా.?
‘మన మాతృ భాష తెలుగు అమ్మ అయితే.. హిందీ పెద్దమ్మ..’ అంటూ, ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం వల్లే ఇదంతా.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటీవల హిందీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. హిందీ సంబంధిత సభ కదా, హిందీ గురించే గొప్పగా మాట్లాడాలి.
Pawan Kalyan Hindi Trolling.. అనధికారిక జాతీయ భాష హిందీ..
నిజానికి, చిన్నప్పటినుంచీ హిందీ చదువుకుంటూనే వున్నాం. హిందీ, జాతీయ అధికారిక భాషగానే చెలామణీ అవుతోంది. అబ్బే, అది జాతీయ భాష కాదంటారు కొందరు.
రైల్వే స్టేషన్లకు వెళితే, తెలుగుతోపాటు హిందీ పేర్లు కనిపిస్తాయి. పొరుగు రాష్ట్రాలకు వెళితే, అక్కడి స్థానిక భాషతోపాటు, హిందీలో పేర్లుంటాయి.. రైల్వే స్టేషన్లకు సంబంధించి.
నార్త్ బెల్ట్‌కి వెళితే, హిందీతో ఏ రాష్ట్రంలో అయినా మేనేజ్ చేసెయ్యొచ్చు. సౌత్‌లోనూ ఇతర రాష్ట్రాలకు వెళితే, అక్కడి భాషలు రానివారికి ఇంగ్లీషు లేదా హిందీ ఉపయోగపడతాయి.
ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా చెప్పడానికేమీ లేదు. ఆ లెక్కన, హిందీ మనకి పెద్దమ్మ కిందే లెక్క. కాదు కాదు, వేల ఏళ్ళ క్రితమే తెలుగు వుంది.. కానీ, హిందీ లేదంటారు కొందరు.
బలవంతంగా రుద్దితే తప్పు..
గతంలో, హిందీని బలవంతంగా రుద్దొద్దని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో, హిందీని పెద్దమ్మ.. అని అంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏం లేదు.
ఏ భాషనీ బలవంతంగా రుద్దడం సబబు కాదు. మాతృ భాషతో పాటు ఇంకో భాషని నేర్చుకోవడం మంచిదే. ఇంగ్లీషు ఎందుకు నేర్చుకుంటున్నాం.? హిందీ కూడా అంతే.
నిజానికి, హిందీ నచ్చక కాదు. హిందీ సినిమాలు చూస్తాం, హిందీలోనూ తెలుగుతోపాటు ముచ్చట్లాడుకుంటాం. సమస్య హిందీ కాదు. హిందీ గురించి, పవన్ కళ్యాణ్ మాట్లాడటమే కొందరికి నచ్చడంలేదు.
పవన్ కళ్యాణ్‌తో ఇబ్బంది వుంటే..
అదీ అసలు సంగతి. పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా ఏమైనా ఇబ్బందులుంటే, అది వేరే చర్చ. కానీ, పవన్ కళ్యాణ్ హిందీ గురించి మాట్లాడారు కాబట్టి, హిందీని తప్పు పడితే ఎలా.?
సోషల్ మీడియా వేదికగా ఉన్మాదులు ఎక్కువయ్యారు. అందుకే, ఈ దుస్థితి. ట్రోలింగ్‌కి హద్దూ అదుపూ లేకుండా పోతోంది. హిందీ చుట్టూ పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న ట్రోలింగ్ కూడా అలాంటిదే.
Also Read: వచ్చేది మా ప్రభుత్వమే.! వైఎస్ జగన్‌కి అసలేంటి సమస్య.?
పార్లమెంటు ఉభయ సభల్లో మెజార్టీ సభ్యులు హిందీలోనే ప్రసంగిస్తుంటారు. హిందీ ఏదో ఒక రూపంలో నిత్యం.. మనకి ఎదురవుతూనే వుంటుంది.
అయినా, హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొచ్చింది.? హిందీ రాకపోతే, మానెయ్యాలిగానీ.. హిందీకి వ్యతిరేకంగా జుగుప్సాకరమైన చర్చ ఏంటి.?