Table of Contents
Janasenani Pawan Kalyan Planning.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ అంటే, కేవలం పవర్ స్టార్ మాత్రమే కాదు, జనసేన పార్టీ అధినేత కూడా. పైగా, పిఠాపురం ఎమ్మెల్యే. అందునా, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా.
జనసేనాని పవన్ కళ్యాణ్ కాబట్టి, జన సేన పార్టీ బలోపేతం గురించి, నిత్యం ఆలోచన చేస్తూనే వుంటారు. కొత్తగా, జన సేన బలోపేతం గురించి స్పెషల్ ఫోకస్ పెట్టడమేంటి.?
అసలెందుకు, ‘జనసేన బలోపేతంపై జనసేనాని స్పెషల్ ఫోకస్’ అనే చర్చ జరుగుతోంది.? వైసీపీ అను‘కుల’ మీడియా నుంచే, ఈ బ్రేకింగ్ న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది.?
Janasenani Pawan Kalyan Planning.. డైవర్షన్ రాజకీయం..
ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ అభిమానులు.. పూర్తిగా, ‘హరి హర వీర మల్లు’ సినిమా సందడిలో బిజీగా వున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులే కదా, జనసైనికులంటే.
పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, కొందరు ఆయన్ని సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఒకే రకంగా కొనసాగాలని ఆశిస్తుంటారు. అలాంటివాళ్ళకి, ఇప్పుడు డబుల్ డ్యూటీ.
సినిమాల్ని, తమ పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవడమెలాగో పవన్ కళ్యాణ్ అభిమానులకు బాగా తెలుసు.
సినిమాల దారి సినిమాలదే, రాజకీయాల దారి రాజకీయాలదే అయినా, రెండిటినీ మిళితం చేయడంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
అధినేత అలా.. అభిమానులిలా..
ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో, పరిపాలన వ్యవహారాలు.. ఇంకోవైపు పవర్ స్టార్‌గా సినిమాలు.. ఇలా రెండు పడవలపై ప్రయాణం కష్టమే అయినా, అత్యంత జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్.
‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ సినిమాల షూటింగ్ పూర్తయిపోయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ నడుస్తోంది. ముందు ముందు, ‘హరి హర వీర మల్లు’ పార్ట్-2 షూటింగ్ కూడా ప్రారంభమవ్వొచ్చు.
అధినేత, ఇలా సినిమా, రాజకీయ వ్యవహారాల్లో బిజీగా వున్నప్పుడు, అభిమానులు కూడా, అలానే తమ సమయాన్ని రెండు వ్యవహారాలకీ విభజించుకుంటారు కదా.?
అదే జరుగుతోందిప్పుడు. మరి, అభిమానుల్ని చూసి, అధినేత ఇంకెంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.? పవన్ కళ్యాణ్ చేస్తున్నదీ అదే.
ఫోకస్.. ఖచ్చితంగా వుంటుంది..
2024 ఎన్నికల్లోనే అరవైకి పైగా సీట్లలో పోటీ చేయాలని జనసేనాని అనుకున్నారు. కానీ, అప్పటికి వున్న పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ తీసుకోలేదు.
ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా వున్నాయ్. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ తీసుకుంటారు కూడా.!
సో, ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 50 నుంచి అరవై నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులేయడంలో వింతేముంది.?
వాస్తవానికి, అదనంగా అరవై కాదు, మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేన బలోపేతం దిశగా జనసేనాని వ్యూహ రచన చేస్తుండొచ్చు. అదేమీ నేరం కాదు కదా.!
Janasenani Pawan Kalyan Planning.. ఏపీ, తెలంగాణతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా..
ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ జనసేన బలోపేతమవ్వాలనే కోణంలోనే పవన్ కళ్యాణ్ వ్యూహాలుంటాయ్. దాన్నెలా తప్పు పట్టగలం.?
మారుతున్న రాజకీయ సమీకరణాలకనుగుణంగా తమిళనాడు, కర్నాటకల్లోనూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ముందు ముందు విస్తరించినా ఆశ్చర్యమేముంది.?
ఇలాంటి పరిస్థితుల్లో, యాభై నియోజకవర్గాలకో, అరవై నియోజకవర్గాలకో తమ రాతల ద్వారా జనసేన పార్టీని పరిమితం చేయాలన్న కుట్ర అయితే, ఓ వర్గం మీడియా నుంచి జరుగుతోందన్నది నిస్సందేహం.
అమ్ముడుపోతున్న మీడియా సంస్థలు.. జర్నలిజం మాటున నడుస్తున్న పాత్రికేయ వ్యభిచారం.. ఇవన్నీ ఇలాంటి వెకిలి వార్తలకు ఆస్కారమిస్తున్నాయి.