Table of Contents
Donald Trump Nuclear Submarine.. పిచ్చోడి చేతిలో రాయి.. అనే సామెతని వింటుంటాం కదా.! ట్రంప్ చేతిలో సబ్‌మెరైన్.. అని చెప్పుకోవాలేమో ఇకపై.!
మొన్నీమధ్యనే ఇరాన్ – ఇజ్రాయెల్ ‘కాన్‌ఫ్లిక్ట్’ నేపథ్యంలో, అమెరికా తన ‘బి-2’ బాంబర్లను ఇరాన్ మీద ప్రయోగించిన సంగతి తెలిసిందే.
యుద్ధోన్మాదం విషయంలో అమెరికా తర్వాతే ఎవరైనా. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట అమెరికా నిత్యం యుద్ధం చేస్తూనే వుంటుంది ఎవరో ఒకరి తరఫున.
ఆయుధాల వ్యాపారి ప్రధాన లక్షణమిది. అదే సమయంలో, ప్రపంచం మీద పెత్తనం కోసం అమెరికా పడే తాపత్రయం కూడా ఈ ‘టెంపరి’తనానికి కారణం.
Donald Trump Nuclear Submarine.. రష్యాని అమెరికా ఎందుకు కెలుకుతోంది.?
అదే, రష్యాని అమెరికా కెలికితే ఎలా వుంటుంది.? ఉక్రెయిన్‌కి సాయం చేయడం ద్వారా, రష్యా మీద కూడా అమెరికా ‘యుద్ధం’ చేస్తూనే వుంది. కాకపోతే, ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు.
అమెరికా – రష్యా మధ్య ‘కోల్డ్ వార్’ ఇప్పటిది కాదు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంలో అమెరికా సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సోవియట్ విచ్ఛిన్నం తర్వాత కూడా, రష్యా అత్యంత శక్తివంతమైన దేశమే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందునా, అణు జలాంతర్గాముల విషయంలో, రష్యా బలం అంతా ఇంతా కాదు.
ఇదంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి తెలియని విషయమా.? కాదు కాదు.. తెలిసిన విషయమే.
తుంటరి ట్రంప్.. ప్రపంచానికి ముప్పు.!
తెలిసీ, రష్యా మీదకి అణు జలాంతర్గాములను ప్రయోగిస్తామంటూ ట్రంప్ ఎలా అనగలిగాడు.? అదే ట్రంప్ తుంటరితనం అంటే.
‘మా వద్ద కూడా అణు జలాంతర్గాములు వున్నాయి’ అంటూ ట్రంప్‌కి ధీటైన సమాధానమిచ్చింది రష్యా. దాంతో, అమెరికా పరువు పోయింది అంతర్జాతీయ సమాజంలో.
Also Read: అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.! ‘అతి’ చెయ్యకూడదు.!
రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ట్రంప్‌కి నచ్చడంలేదు. ప్రస్తుతానికైతే భారత్ మీద ‘సుంకాల యుద్ధం’ మొదలు పెట్టాడు ట్రంప్.
ఏమో, ముందు ముందు భారత్ మీద కూడా, ‘అణు జలాంతర్గాములు ప్రయోగిస్తాం’ అని ట్రంప్, తుంటరి వాగుడు వాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రష్యా – భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం..
రష్యా – భారత్ మధ్య దశాబ్దాలుగా రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం వుంది. బ్రహ్మోస్ క్షిపణుల్ని భారత్ – రష్యా సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పోటీ నేపథ్యంలో, రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటోంది భారతదేశం.. అదీ తక్కువ ధరకి. ఇది ట్రంప్‌కి అస్సలు నచ్చడంలేదు.
దానికి తోడు, అమెరికా తయారీ ఎఫ్-35 యుద్ధ విమానాల్ని భారతదేశానికి అంటగట్టాలనుకున్న ట్రంప్ యత్నాలూ బెడిసికొట్టాయి.
ఈ నేపథ్యంలో, రష్యాని బెదిరించినట్లే, అణు జలాంతర్గాముల్ని బూచిగా చూపి, భారత్‌నీ ట్రంప్ బెదిరిస్తే.?
