Table of Contents
Rahul Gandhi EVM Politics.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధాని పీఠం ఎక్కి వుండాలి. రాజకీయాల్లో ఏమాత్రం నిలకడ లేని వ్యక్తి రాహుల్ గాందీ.
ఆ నిలకడే వుండి వుంటే, రాహుల్ గాంధీని ఎప్పుడో ప్రధానిగా చూసి వుండేవాళ్ళం. కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ కాకుండా, మన్మోహన్ సింగ్ ఎందుకు ప్రధాని అయినట్లు.?
ఎందుకంటే, రాహుల్ గాంధీకి నిలకడ లేదు కాబట్టి.. అన్న సమాధానం, కాంగ్రెస్ నేతల నుంచే వస్తుంటుంది. అదీ, రాహుల్ నిలకడలేమి వ్యవహారం.
ప్రధాని పదవి కావాలని రాహుల్ గాంధీ కూడా కోరుకోలేదు. నిజానికి, రాజకీయాల పట్ల రాహుల్ గాంధీ గతంలో ఏమంత ఆసక్తి కనబరచలేదు.
Rahul Gandhi EVM Politics… చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..
ఏదో తప్పదన్నట్లు, రాజకీయాల్లో వుంటూ వచ్చారు రాహుల్ గాంధీ. ఇప్పుడేమో, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, రాహుల్ గాంధీ సీరియస్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నో డౌట్, రాహుల్ గాంధీ కొన్నాళ్ళ క్రితం చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర, కాంగ్రెస్ పార్టీకి కొంత పొలిటికల్ మైలేజ్ తెచ్చింది. కానీ, ఇదే సరిపోతుందా.? సరిపోదు.
గత కొద్ది రోజులుగా రాహుల్ గాందీ, ఈవీఎం రాజకీయాలు చేస్తున్నారు. ‘ఓట్ చోర్’ అంటూ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి చీవాట్లు కూడా పడుతున్నాయి.
ఓట్ చోరీ.. ఇదేం పద్ధతి రాహుల్.?
ఓట్ చోరీ వల్లే ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని రాహుల్ చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది కూడా, ఈవీఎం ద్వారానే కదా.?
ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు.. అంటూ కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీలు కొత్త పల్లవి అందుకుంటున్నాయి. ఓడిపోయిన పార్టీలే ఇలా కోరుకుంటున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్సీపీ.. బ్యాలెట్ ఎన్నికలు కోరుకుంటున్న తీరు చూస్తోంటే, ముందు ముందు ఆ పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదంతా, రాహుల్ గాంధీకి కలిసొచ్చే వ్యవహారమా.? అసలు దేశంలో మళ్ళీ బ్యాలెట్ ఎన్నికలు జరిగే అవకాశం వుంటుందా.? అంటే, బ్యాలెట్ ఎన్నికలు అయితే జరగకపోవచ్చు.
ప్రధాని అయ్యే అవకాశమెంత.?
ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా.? అంటే, ‘ఈవీఎం రాజకీయం’తో అయితే, ఆయనకు అధికారం దక్కే అవకాశాల్లేవు.
కానీ, ఇకనైనా సీరియస్ పాలిటిక్స్ చేయగలిగితే, ప్రజా సమస్యలపై గట్టిగా నిలబడగలిగితే, రాహుల్ గాంధీకి ప్రధాని పీఠం దక్కుతుందేమో సమీప భవిష్యత్తులో.!
Also Read: అతను, ఆమె.. ఓ కారులో ప్రయాణిస్తే.. అదో పెద్ద క్రైమ్.!
అయితే, అంత ఓపిక కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీకి వుండాలి కదా.?
ఇప్పుడు రాహుల్ గాంధీకి ఈవీఎం విషయంలో మద్దతుగా నిలుస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలు, ముందు ముందు ఆయనకి అండగా వుంటాయా.?