Darshan Thoogudeepa Poison.. అతనో ప్రముఖ సినీ నటుడు. అత్యంత హేయంగా, తన అభిమానినే చంపేశాడు.! కన్నడ సినీ పరిశ్రమలో చోటు చేసుకుందీ దుర్మార్గమైన ఘటన.
రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో వున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. దర్శన్, అతని భార్య కలిసి రేణుకా స్వామిని హత్య చేసినట్లు అభియోగాలున్నాయి.
కొన్నాళ్ళ క్రితం ఈ కేసులో ఆయన బెయిల్ మీద విడుదలైనా, బెయిల్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో.. తిరిగి జైలుకు వెళ్ళాడు.
Darshan Thoogudeepa Poison.. విషం కావాలంటాడేంటి.?
దర్శన్ అరెస్టయ్యింది హత్య కేసులో.! దర్శన్ ఈ హత్య చేయించినట్లు ఆధారాల్ని ఇప్పటికే న్యాయస్థానం ముందుంచారు. రేణుకా స్వామిని అత్యంత దారుణంగా దర్శన్ కూడా హింసించాడనేది ప్రధాన ఆరోపణ.
ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమై, భౌతిక దాడి స్వయంగా చేసినట్లు అభియోగాలు మోపబడ్డ దర్శన్, కోర్టులో తనకు విషం ఇవ్వాలంటూ కోరడం మరింత వివాదాస్పదమవుతోంది.
జైల్లో సౌకర్యాలు అస్సలు బాగోలేవనీ, ఈ కారణంగా తనకు విషం ఇచ్చి చంపేయాలని దర్శన్, నేరుగా కోర్టులో న్యాయమూర్తికి విన్నవించాడు.
సౌకర్యాలు అడిగే పద్ధతి ఇదా.?
ప్రముఖులకు, జైల్లో సకల సౌకర్యాలు లభిస్తాయన్న వాదన ఈనాటిది కాదు. ఆ సంగతి పక్కన పెడితే, తగిన సౌకర్యాల నిమిత్తం, కోర్టుకి నిందితులు కావొచ్చు, దోషులు కావొచ్చు అభ్యర్థించే అవకాశం వుంది.
సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం, జైల్లో ఖైదీలకు కల్పించే సౌకర్యాలపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చు కూడా.!
Also Read: చెట్టు పేరూ.. జాతి పేరూ.! ఎక్కడో తేడా కొడుతోంది ‘మంచు’ మనోజూ.!
కానీ, ఇలా విషం అడగడమేంటి.? ఇదేం హీరోయిజం.? తెరపై హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన దర్శన్ నుంచి, ఈ స్థాయి దిగజారుడుతనం ఊహించలేదని, అతని అభిమానులూ అంటున్నారు.
మతి చెడిందా.? మూర్ఖత్వమా.? లేదంటే, కావాలనే చేశాడా.? దర్శన్ ఎందుకిలా ప్రవర్తించాడు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
సింపతీ డ్రామాలో భాగంగానే దర్శన్, ‘విషం’ వ్యాఖ్యల్ని న్యాయస్థానంలో చేశాడన్న అనుమానాలు తెరపైకొస్తుండడం గమనార్హం.