Amruta Fadnavis Dressing Trolling.. స్కిన్ టైట్ డ్రెస్ వేయడం.. ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యేవారికి కొత్తేమీ కాదు.!
వెండి తెరపై అందాల భామలు మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లోనూ అమ్మాయిలు, మహిళలూ ఫ్యాషన్ ట్రెండ్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటారు.
సోషల్ మీడియా పుణ్యమా అని.. వర్కవుట్ వీడియోలు, ఫొటోలతో సెలబ్రిటీలూ, సామాన్యులూ, ఇన్‌ఫ్లూయెన్సర్లూ.. ‘రంగుల ప్రపంచాన్ని’ మరింత కలర్ఫుల్గా మార్చేస్తున్నారు.
జాగింగ్ చేసేటప్పుడు, దానికి అనుగుణమైన డ్రెస్ ధరించాలి.. స్విమ్మింగ్ చేసేటప్పుడు.. దానికి అనుగుణమైన కాస్ట్యూమ్ వుంటుంది.
Amruta Fadnavis Dressing Trolling.. మహిళలైనా.. మగాళ్ళైనా..
మగాళ్ళకైనా, మహిళలకైనా.. ఈ ప్రత్యేక వస్త్రధారణ మామూలే. చిన్న నిక్కరు వేసుకుని, మగాళ్ళు తిరిగితే తప్పు లేదుగానీ, అవే పొట్టి నిక్కర్లు అమ్మాయిలు వేసుకుంటే తప్పా.? అని ప్రశ్నించేవారూ లేకపోలేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, అమృత ఫడ్నవిస్ వస్త్రధారణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురవుతోంది గనుక.
ఎవరీ అమృత ఫడ్నవిస్.? అంటే, ఆమె ఓ బ్యాంకర్.. అలానే, సింగర్ కూడా.! అంతేనా, అంతకు మించి.! ఆమె ఎవరో కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.
ముంబైలో వినాయక చవితి అనంతరం నిమజ్జనాల నేపథ్యంలో, సముద్ర తీరంలో ‘ప్రక్షాళన’ అవసరమైంది. అమృత, సోషల్ వర్కర్ కూడా కావడంతో, ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
అక్షయ్ కుమార్ కూడా..
ఓ సినీ ప్రముఖుడూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతనెవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.
పలు స్వచ్ఛంద సంస్థలు, బీచ్ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో, అమృత డ్రెస్సింగ్ వివాదాస్పదమవుతోంది.
ఒంటికి అతుక్కుపోయేలా వున్న దుస్తులు ధరించారు అమృత ఫడ్నవిస్. సంబంధిత వీడియోల్ని కట్ చేసి, వల్గర్‌గా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు.
అక్కడ, ఆమె ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన చెత్త తొలగించే కార్యక్రమం చేపట్టారామె.
Also Read: ఉద్యోగాలన్నీ ఊడిపోతే.! ఆ భయాన్ని అధిగమిస్తేనే భవిష్యత్తు.!
కానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత డ్రెస్సింగ్.. సోషల్ మీడియాలో ‘చెత్త పోగవడానికి’ కారణమయ్యింది.
నిజానికి, అమృత ఫడ్నవిస్‌కి ఈ తరహా ట్రోలింగ్ కొత్తేమీ కాదు. గతంలోనూ, ఇదే తరహా ట్రోలింగ్ ఆమె ఎదుర్కొంది. కానీ, పట్టించుకోలేదు.! లైట్ తీసుకుందంతే.