Rukmini Vasanth Madharaasi Beauty.. రుక్మిణి వసంత్.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమా ‘మదరాసి’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మ పేరు ట్రెండింగ్ అయిపోయింది.
ఆ సినిమాని తెలుగులో ప్రమోట్ చేసిన విధానం అట్టిది మరి. దాంతో రుక్మిణి వసంత్ తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైపోయింది. యూత్‌లో తెగ ట్రెండింగ్ అయిపోయింది.
సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ గురించిన చర్చ నెక్స్‌ట్ లెవల్ వుంది. ఇంతకీ ఎవరీ రుక్కిణీ వసంత్.? ఎందుకింతలా రుక్మిణి వసంత్ గురించి కుర్రకారు ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నట్టు.?
Rukmini Vasanth Madharaasi Beauty.. కళల పట్ల ఆసక్తి అప్పటి నుంచే..
ఆమెకు ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కానీ, చిన్నతనం నుంచీ కళల పట్ల ఆసక్తి ఎక్కువ. అలా చదువుతో పాటూ, నటన, నృత్యం వంటి కళలలోనూ శిక్షణ తీసుకుంది.

బేసిగ్గా రుక్కిణీ వసంత్ తల్లి కూడా ఓ కళాకారిణి కావడం ఆమె ఆసక్తికి మరో కారణం. రుక్మిణి వసంత్ సింప్లిసిటీకి కూడా ఆమె అమ్మే కారణమట.!
రుక్మిణి తండ్రి గురించి ఈ షాకింగ్ విషయం తెలుసా.?
రుక్మిణీ వసంత్ తండ్రి భారత సైన్యంలో ఓ వున్నతమైన అధికారి. జమ్ము కాశ్మీర్ భద్రతా పరమైన బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదుల దాడిలో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచారు.
భారత సైన్యం నుంచి అత్యున్నత గౌరవ పురస్కారం ‘అశోక చక్ర’ను పొందిన తొలి కర్ణాటక వ్యక్తి ఈయనే అని చెబుతారు.
Also Read: ఉద్యోగాలన్నీ ఊడిపోతే.! ఆ భయాన్ని అధిగమిస్తేనే భవిష్యత్తు.!
అలాంటి ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన రుక్మిణీ వసంత్ ప్రస్తుతం సినిమాల్లో రాణించాలనుకుంటోంది.
అందంతో పాటూ, ఫ్యామిలీ నుంచి వచ్చిన క్రమశిక్షణ సినిమాల్లో ఆమెను మరింత వున్నత స్థాయిలో వుంచేందుకు తోడ్పడుతుందనడం అతిశయోక్తి కాదు.
