Pawan Kalyan Movies YSRCP Downfall.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తోంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వెన్నులో వణుకు పుడుతోంది.!
సక్సెస్, ఫెయిల్యూర్.. వీటికి అతీతంగా పవన్ కళ్యాణ్ సినిమాలుంటాయి. ఆగిపోయిందనుకున్న సినిమా ‘హరి హర వీర మల్లు’కి ప్రీ రిలీజ్ క్రియేట్ అయిన హైప్ ఇందుకు నిదర్శనం.!
వస్తుందో.. రాదో.. అన్న గందరగోళం నడుమ, ‘ఓజీ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ‘ఓజీ’ హైప్ వేరే లెవల్లో వుందిప్పుడు.!
ఇంకోపక్క, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్‌ని కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ పూర్తి చేసేశారు. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందకు వచ్చేస్తోంది.
Pawan Kalyan Movies YSRCP Downfall.. 2024 కంటే ముందు మొదలైన సినిమాలే..
ఈ సినిమాలన్నీ, 2024 ఎన్నికల కంటే ముందే ప్రారంభమైనవి. 2019 ఎన్నికల సమయంలో, సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామని పవన్ కళ్యాణ్ అనుకున్నమాట వాస్తవం.
పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావించినా, రాజకీయాలతోపాటు సినిమాలూ చేయాలని అభిమానుల నుంచి, సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది.
మరీ ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘సినిమాలు, రాజకీయాలు.. ఇలా రెండు పడవల ప్రయాణం సమర్థవంతంగా చేయగలడు’ అని చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
పవన్ కళ్యాణ్‌కి సినిమాలే ప్రధాన ఆదాయ వనరు. ఆ సినిమాల నుంచి వచ్చే సంపాదనతోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటారాయన.
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాల కోసం కోట్లాది రూపాయల్ని పవన్ కళ్యాణ్ వెచ్చించారంటే, సినిమాల నుంచి వచ్చిన ఆదాయం కారణంగానే.
జగన్‌కి వున్న వ్యాపారాలు పవన్ కళ్యాణ్‌కి లేవు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాక్షి మీడియా సహా, సిమెంట్ కంపెనీలు, పవర్ కంపెనీలు.. చాలానే వున్నాయి. ఇవన్నీ ఆయనకు ఆదాయ వనరులు.
పవన్ కళ్యాణ్‌కి అలాంటి వ్యాపారాలేమీ లేవు. ఆయనకి ప్రధాన ఆదాయ వనరు సినిమా. నటించడం అనేది పవన్ కళ్యాణ్ వృత్తి. ఆ వృత్తి మీద దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదంటే, వైసీపీకి బానిస అయిన ఓ మాజీ ఐఏఎస్ అధికారితో కోర్టులో కేసు వేయిస్తే, న్యాయస్థానం సదరు వ్యక్తికి గూబ గుయ్యిమనేలా తీర్పునిచ్చింది.
Also Read: మిరాయ్.! తేజ సజ్జాని వేపుకు తింటున్న తెగులు మాఫియా.!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా లాంటి వాళ్ళతో, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై విమర్శలు చేయిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఇవన్నీ, పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఆపగలవా.? ఆపలేవు. కానీ, వైసీపీ చేసే ఇలాంటి నీఛమైన పనులు.. పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కే పొలిటికల్‌గా అడ్వాంటేజ్ అవుతున్నాయి.
అదే సమయంలో, వైసీపీని ఈ సినిమా రాజకీయాలు.. పాతాళానికి తొక్కేస్తున్నాయి. భస్మాసుర హస్తం.. అంటాం కదా, అదీ పరిస్థితి.!