Table of Contents
Apple I Phone Mania.. ఐ ఫోన్ కాకపోతే, శాంసంగ్ ఫోన్.. అదీ కాకపోతే, ఇంకేదో ఫోన్.! ఏ ఫోన్ అయితేనేం, ‘ఎర్ర బటన్.. పచ్చ బటన్’.!
మొబైల్ ఫోన్ల వాడకం గురించి, చర్చ సందర్భంగా ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం. సినిమాటిక్ డైలాగులే ఇవన్నీ.!
నిజానికి, ‘ఎర్ర బటన్.. పచ్చ బటన్’ రోజులెప్పుడో పోయాయ్.! స్మార్ట్.. మరింత స్మార్ట్.. అయిపోతున్నారు జనం, మొబైల్ ఫోన్ల వాడకం విషయంలో.
Apple I Phone Mania.. ఐ-ఫోన్.. ఆ కిక్కే వేరప్పా.!
ఐ-ఫోన్ చేతిలో వుంటే చాలు, ప్రపంచం మన పాదాల కింద వున్నట్లేనన్న భావన కొందరిలో వుంటుంది. ఎందుకంటే, ‘ఐ-ఫోన్’ అనేది స్టేటస్ సింబల్ అయి కూర్చుంది మరి.
నిజానికి, ‘ఐ-ఫోన్’ కంటే ఖరీదైన ఫోన్లున్నాయి. ఫీచర్ల పరంగా కూడా, ‘ఐ-ఫోన్’ కంటే మెరుగైన ఫోన్లున్నాయ్. అయినాగానీ, ‘ఐ-ఫోన్’ అంటే, దాని రేంజ్ వేరు.. అంటారు కొందరు.
ఏదన్నా కొత్త మోడల్ ‘ఐ-ఫోన్’ నుంచి వస్తోందంటే, అంతే సంగతులు. యాపిల్ కంపెనీ నుంచి, అలాంటి ప్రకటన కోసం ‘ఐ-ఫోన్’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు.!
పదిహేను.. పదహారు.. పదిహేడు.. పద్ధెనిమిది.!
చూస్తుండగానే, పాత వెర్షన్ మాయమై, కొత్త వెర్షన్ వచ్చేస్తోంది. మొన్న కదా, ఐ-ఫోన్ 14వ వెర్షన్ కొన్నాం.. అనుకునేంతలోపు, పదిహేను వచ్చేసింది.
పదహారూ వెళ్ళిపోయింది.. పదిహేడు వచ్చేసింది కూడా.! ఈ ఐ-ఫోన్ 17 కోసం, కొందరు బిచ్చగాళ్ళలా మారిపోయి, రోడ్ల మీద బారులు తీరడం హాట్ టాపిక్ అయ్యింది.
మార్కెట్లోకి వచ్చే ఫోన్, ముందుగా తమ పాకెట్లో ఇమిడిపోవాలన్నది ఆ ఔత్సాహికుల కోరిక. అదీ అసలు సంగతి.
మరీ, బిచ్చగాళ్ళలా మారిపోవాలా.? అంటే, అదంతే.! ‘మేం ఎందుకు బిచ్చగాళ్ళమయ్యాం.? ఫోన్ కోసం లక్ష, ఆ పైన ఖర్చు చేయడానికి సిద్ధంగా వున్నాం’ అంటారు వారంతా.
పిచ్చెక్కిపోవాల్సిందే మరి.!
కంపెనీలు మొబైల్ ఫోన్లను తయారు చేసే క్రమంలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ, అందిస్తున్న ఫీచర్లు.. ఇవన్నీ కొత్త వెర్షన్ ఫోన్లంటే కొనేవారికి పిచ్చెక్కిపోయేలా చేస్తున్నాయన్నది నిస్సందేహం.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
ఇదో మార్కెటింగ్ గిమ్మిక్కు.! అందుకే, ఐ ఫోన్ కోసం, తండ్రి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేయడమే కాదు, హత్యలు చేయడానికీ వెనుకాడ్డంలేదు కొందరు.
గర్ల్ ఫ్రెండ్ని పటాయించాలంటే, ఐ-ఫోన్ గిఫ్ట్ ఇస్తే సరి.! దానికోసం, ఏం చేయడానికైనా ‘సై’ అంటున్నారు కుర్రకారు. వేరే ఏ ఫోన్కీ లేని పిచ్చి.. ఇది.!
