Table of Contents
అమ్మో అమ్మాయిలా.? అమ్మాయిలంటే పరమ సెడ్డ సిరాకు.. (Manmadhudu 2 Teaser Review) అంటూ మొదటి మన్మధుడు (Manmadhudu) అమ్మాయిలకి చాలా దూరంగా కనిపించాడు.
అంతే కాదు, వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. ఆగరా బాధరా నువ్వెళ్లెళ్లి గోతిలో పడొద్దురా బయ్.. అంటూ పాటేసుకుని మరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు కింగ్ నాగ్ ‘మన్మథుడు’ సినిమాతో అప్పట్లో.
కానీ, ఇప్పుడు పైకి బుద్ధిమంతుడిలా కనిపిస్తూనే, ఎవరికీ తెలియని మన్మధుడ్ని లోపల ఉరకలేయించేస్తున్నాడు రెండో మన్మధుడు (Manmadhudu2).
అవునండీ మన్మధుడి కోసం మాట్లాడుకునే టైమొచ్చేసింది. రెండో మన్మధుడు అదేనండీ ‘మన్మధుడు 2’ (Manmadhudu 2) టీజర్ వదిలారు కదా. ఆ టీజర్ (Manmadhudu2 Teaser) సారాంశమే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం.
ఆషా మాషీ మన్మథుడు కాదండోయ్.. (Manmadhudu 2 Teaser Review)
వామ్మో ఈ మన్మధుడు అస్సలు తక్కు కాదండోయ్. అప్పుడు అమ్మాయిలంటే చిరాకు అన్నాడు. అమ్మాయిలు కలిసి మాట్లాడుకుంటే ఉప్పర మీటింగ్ అన్నాడు. కానీ, ఇప్పుడు ఈ అమ్మాయి, ఆ అమ్మాయి అనే తేడా లేకుండా ఎలా రొమాన్స్ చేసేస్తున్నాడో చూస్తున్నారుగా. అద్దీ సంగతి.
అందుకే మరి మన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) 17 ఏళ్ల క్రితం అమ్మాయిల్ని ద్వేషించాడు.. 17 ఏళ్ల తర్వాత హా హా హా.. నాగార్జునగారూ మీ ఛార్మింగ్ లుక్ మా అందరికీ ఆదర్శం.. మీ నుండి మేం చాలా నేర్చుకోవాలి.. అని ట్వీటాడు.
మెగా మేనల్లుడు మాత్రమే కాదు, మొత్తంగా సినీ పరిశ్రమలో ప్రముఖులంతా మన్మథుడు2 టీజర్ చూసి ఆశ్చర్యపోయారు. కామెడీ అదిరిందని కొందరు.. నాగ్ కుర్రాడిలా మారిపోయాడని మరికొందరు.. అబ్బో, రచ్చ ఓ రేంజ్లో జరిగిపోతోంది.
టీజర్ విషయానికి వస్తే, ఏజ్ బార్ అయ్యి, ఇంకా పెళ్లి కాని ప్రసాద్‌లానే ఉంటాడు మన మన్మధుడు. అందరూ పాపం బుద్దిమంతుడు. అక్షరాలా ‘వర్జిన్’ అనుకుంటారు. కానీ, మనోడు పరమ రొమాంటిక్ రాక్షసుడట. కనిపించిన ప్రతీ అమ్మాయితోనూ రొమాన్సే రొమాన్స్.
Working out in Portugal with the beautiful @Rakulpreet! #Manmadhudu2diaries@vennelakishore @23_rahulr @Viacom18movies @AnnapurnaStdios @AnandiArtsOffl pic.twitter.com/kyF62KL0zm
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 26, 2019
స్వీట్ షాకిచ్చిన కింగ్ నాగ్.. (Manmadhudu 2 Teaser Review)
‘మన్మధుడు 2’ ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. స్వీట్ షాకే ఇచ్చాడు ‘మన్మధుడు 2’తో నాగార్జున. టీజర్ వచ్చాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అసలేమాత్రం అంచనాలే లేని ‘మన్మధుడు 2’, టీజర్ ఇచ్చిన స్వీట్ అండ్ రొమాంటిక్ షాక్‌తో ఆకాశాన్నంటే అంచనాల్ని పెంచేసింది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్లో ఎవరెవరో అమ్మాయిలు కనిపించారు కానీ, హీరోయిన్లు కనిపించలేదండోయ్. హీరోయిన్స్ కోసం మన్మధుడు ఇంకో టీజర్‌ని వదులుతాడేమో. ఆ టీజర్లో ఇంకెంత రొమాన్స్ చూపిస్తాడో.
ఆల్రెడీ విడుదలైన పోస్టర్స్‌లో రకుల్ ప్రీత్‌తో (Rakul Preet Singh) నాగార్జున కెమిస్ట్రీ సూపర్బ్‌గా కనిపిస్తోంది. సింగిల్ స్టిల్‌తోనే కీర్తిసురేష్‌తో (Keerthy Suresh) ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాడు కింగ్ నాగ్. ఇక టీజర్ కానీ విడుదల చేశాడా.? ఇంక అంతే ఫ్యాన్స్ ఫ్లాట్ అయిపోతారంతే.
డైరెక్టర్ దుమ్ము రేపాడంతే..
డైరెక్టర్ విషయానికి వస్తే, హీరోగా పలు చిత్రాలతో సుపరిచితుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). ‘చిలసౌ’ సినిమాతో ఆల్రెడీ దర్శకుడిగా సత్తా చాటేశాడు.
కానీ, ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నాగార్జునతో (Akkineni Nagarjuna) ఇలాంటి సినిమా ప్లాన్ చేస్తాడని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరండీ బాబూ. కానీ, చేసి చూపించాడు.
టీజర్‌తోనే ఇలా చేయించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. సినిమాలో మన్మథుడు నాగార్జునని ఇంకెంతలా చూపించాడో చూడాలంటే ఆగస్ట్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆగస్ట్ 9 న ‘మన్మధుడు 2’కి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios), ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ (Anandi Art Creations), వయాకామ్ 18 సంస్థలతో కలిసి సంయుక్తంగా నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కోడలు ‘బేబీ’ కథేంటి.?
అన్నింటికీ మించి ఫస్ట్ అండ్ ది మోస్ట్ బెస్ట్ ఎలిమెంట్.. ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత (Samantha Akkineni) కూడా కీలక పాత్ర పోషిస్తుండడమే కదా. సమంతది గెస్ట్ రోలే. కానీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రట.
సమంత పాత్ర సినిమాలో ఎప్పుడొస్తుందో, మన మన్మధుడికి ఎలాంటి క్లాస్ తీసుకుంటుందో గెస్ చేయడం ప్రస్తుతానికైతే కష్టమే మరి. సినిమాలో సమంతను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఎక్కడ ఎలా చూపించాడో తెలుసుకోవాలనుందా.?
అబ్బో అంత తొందర పనికి రాదండీ. చెప్పుకున్నాంగా.. ఈ ‘మన్మథుడు2’ (Manmadhudu 2) కోసం ఆగస్ట్ 9 వరకూ వెయిట్ చేయాల్సిందే తప్పదు మరి.